Site icon Prime9

Mukesh Ambani: బద్రీనాథ్ ఆలయానికి రూ.5 కోట్లు విరాళమిచ్చిన ముఖేష్ అంబానీ

Mukesh Ambani

Mukesh Ambani

Uttarakhand: రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ గురువారం ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ ధామ్‌లో ప్రార్థనలు చేసి ఆలయానికి రూ.5 కోట్ల రూపాయల విరాళాన్ని అందించారు. గురువారం ఉదయం ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు ఆలయ కమిటీ ఉపాధ్యక్షుడు కిషోర్ పవార్ స్వాగతం పలికారు. అంబానీ ప్రతి సంవత్సరం ఈ పురాతన ఆలయాన్ని సందర్శిస్తారు.

గత నెలలో ముఖేష్ అంబానీఆలయాన్ని సందర్శించడానికి డెహ్రాడూన్‌లోని జాలీ గ్రాంట్ విమానాశ్రయానికి వచ్చారు. అయితే వాతావరణం సరిగా లేకపోవడంతో ఆయన మందిరం వైపు వెళ్లలేకపోయారు. కుటుంబ సమేతంగా అక్కడికి వెళ్లిన ఆయన దర్శనాన్ని రద్దు చేసుకున్నారు.

గత నెలలో, అంబానీ ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి ఆలయంలో ప్రార్థనలు చేసి వేంకటేశ్వరుని ఆలయానికి 1.5 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చారు. సెప్టెంబరు 12న, అంబానీ రాజస్థాన్‌లోని ఉదయపూర్‌కు సమీపంలో ఉన్న నాథ్‌ద్వారాలోని శ్రీనాథ్‌జీ ఆలయాన్ని సందర్శించి ప్రార్థనలు చేశారు.2019లో, అంబానీ చందనం మరియు కుంకుమ కొనుగోలు కోసం బద్రీనాథ్ కేదార్‌నాథ్ ఆలయ కమిటీ కి సుమారు రూ. 2 కోట్లు విరాళంగా ఇచ్చారు.

Exit mobile version