Site icon Prime9

CM Mohan Yadav: మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ తీసుకున్న మొదటి నిర్ణయం ఏమిటో తెలుసా?

Mohan Yadav

Mohan Yadav

CM Mohan Yadav:మధ్యప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ బుధవారం ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని గంటల తర్వాత మతపరమైన మరియు బహిరంగ ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్లను నిషేధించాలని ఆదేశాలు జారీ చేసారు. అయితే సాధారణ మరియు నియంత్రిత లౌడ్ స్పీకర్ల వాడకంపై ఎటువంటి నియంత్రణ లేదని తెలిపారు.

మాసం విక్రయాలపై నిబంధనలు..(CM Mohan Yadav)

నియంత్రిత లౌడ్‌స్పీకర్‌లు నిర్ణీత డెసిబెల్ పరిమితుల్లో నిర్ణీత సమయాల్లో మాత్రమే ఉపయోగించడానికి అనుమతించబడతాయి. చట్ట ప్రకారం నిర్వహించే లౌడ్ స్పీకర్లపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనితోపాటు బహిరంగంగా మాంసం విక్రయాలను నిషేధించాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి యూదవ్ విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తూ, ఈ రోజు జరిగిన మొదటి క్యాబినెట్ సమావేశంలో ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుందని చెప్పారు. మేము బహిరంగంగా మాంసం విక్రయాల సమస్యను లేవనెత్తాము. దీని కోసం నిబంధనలను తీసుకురావాలని ప్రతిపాదించామని చెప్పారు.

58 ఏళ్ల మోహన్ యాదవ్  మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర రాజధాని భోపాల్‌లోని లాల్ పరేడ్ గ్రౌండ్‌లో గవర్నర్ మంగూభాయ్ పటేల్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, మాజీ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ హాజరయ్యారు.

Exit mobile version