Site icon Prime9

Parliament Monsoon Sessions: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం

Parliament

Parliament

Parliament Monsoon Sessions: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 11 వరకు 17 రోజులపాటు కొనసాగుతాయి. ఆ సమావేశాల్లో 31 బిల్లులను ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.మణిపూర్ హింస, రైల్వే భద్రత, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, భారత్-చైనా సరిహద్దు స్థితి మరియు రెండు దేశాల మధ్య వాణిజ్య సమతుల్యత వంటి ఇతర అంశాలను వర్షాకాల సమావేశంలో లేవనెత్తడానికి ప్రతిపక్షాలు సిద్ధంగా ఉన్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో మొదటి రోజు మణిపూర్ హింసాకాండతోపాటు ఇతర సమస్యలపై వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని కొన్ని పార్టీలు ప్లాన్ చేశాయి. ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలోనే చర్చ జరగాలని ప్రతిపక్షాలు కూడా పట్టుబట్టాయి.

వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలకు ముందు 26 ప్రతిపక్ష పార్టీలు కూటమిగా ఏర్పడి ‘I.N.D.I.A’ లేదా ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్ అని పేర్కొన్న రెండు రోజుల తర్వాత వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాల సందర్భంగా ఢిల్లీలో అడ్మినిస్ట్రేటివ్ సేవల నియంత్రణపై ఆర్డినెన్స్‌తో సహా పలు అంశాలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రతిపక్షాలు యోచిస్తున్నాయి. వర్షాకాల సమావేశానికి ముందు మణిపూర్ హింసాత్మక ఘటనలపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వీడారు. మే 4న మణిపూర్ లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో వైరల్ గా మారిన నేపధ్యంలో ఆయన స్పందించారు. మణిపూర్‌లో జరిగిన ఘటన తనను బాధించిందని, దోషులను విడిచిపెట్టబోమని ప్రధాని మోదీ స్పష్టం చేసారు.

మణిపూర్ ఘర్షణలపై వాయిదా తీర్మానం..(Parliament Monsoon Sessions)

ఈరోజు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తర్వాత లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది.ఇటీవల మృతి చెందిన సభ్యులకు నివాళులర్పిస్తూ సభ వాయిదా పడింది.రాజ్యసభ కార్యకలాపాలు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి. 75 ఏళ్ల వయసులో జూన్‌లో మరణించిన సిట్టింగ్ ఎంపీ హర్‌ద్వార్ దూబేకి నివాళిగా సభ వాయిదా పడింది.మణిపూర్‌లో జరుగుతున్న జాతి ఘర్షణలపై చర్చించేందుకు కాంగ్రెస్ లోక్‌సభ ఎంపీ మనీష్ తివారీ వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. ఈశాన్య రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న హింసపై చర్చ జరగాలని డిమాండ్ చేస్తూ మణిపూర్‌ పరిస్థితిపై కాంగ్రెస్‌ అభ్యర్థి మాణికం ఠాగూర్‌ లోక్‌సభలో వాయిదా తీర్మానం నోటీసులు ఇచ్చారు.

Exit mobile version