Karnataka Polls: ఈ నెల 10న రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో ప్రధాన రాజకీయపార్టీలు ఓటర్లకు పంచడానికి పెద్ద ఎత్తున నగదును సిద్దం చేసాయి. ఈ నేపధ్యంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు తమకు వచ్చిన సమాచారం మేరకు దాడులు చేసి వీటిని స్వాధీనం చేసుకుంటున్నారు.
మైసూర్‌లోని సుబ్రమణ్య రాయ్ ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ కోటి రూపాయలను స్వాధీనం చేసుకుంది. రాయ్ పుత్తూరు కాంగ్రెస్ అభ్యర్థి అశోక్ కుమార్ రాయ్ సోదరుడు.మామిడిచెట్టుపై పెట్టెలో దాచిన సొమ్మును బుధవారం అధికారులు స్వాధీనం చేసుకున్నారు.ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో గత కొన్ని వారాలుగా ఐటీ శాఖ దాడులు నిర్వహించింది.కోటి రూపాయల నగదుతో ఇద్దరు వ్యక్తులను బెంగళూరు పోలీసులు పట్టుకున్నారు. ఏప్రిల్ 13న సిటీ మార్కెట్ ఏరియా సమీపంలో ఓ ఆటో నుంచి దీనిని రికవరీ చేశారు.
ఎన్నికల సందర్బంగా కర్ణాటకలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) అమలులో ఉంది. అందువలన సరైన పత్రాలు లేకుండా పెద్ద మొత్తంలో నగదు తరలించడం రాష్ట్రంలో అనుమతించబడదు.గత నెలలో కూడా హుబ్బళ్లిలోని ప్రైవేట్ రియల్ ఎస్టేట్ డెవలపర్ అంకిత బిల్డర్స్ కార్యాలయం, దాని యజమాని నారాయణ్ ఆచార్య నివాసంపై ఐటీ బృందాలు దాడులు నిర్వహించాయిదక్షిణ కన్నడలోని బెల్తంగడిలోని మాజీ కాంగ్రెస్ నాయకుడు గంగాధర్ గౌడకు చెందిన రెండు నివాస స్థలాలు మరియు విద్యా సంస్థపై ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించింది. ఈ విద్యాసంస్థ గంగాధర్ గౌడ్ కుమారుడు రంజన్ గౌడ్ కు చెందినది.గౌడ 2018లో బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు టిక్కెట్ నిరాకరించడంతో ఆయన ఇటీవల రాజకీయాల నుంచి వైదొలగినట్లు ప్రకటించారు.కర్ణాటకలో మే 10న ఎన్నికలు జరగనుండగా, మే 13న ఫలితాలు వెలువడనున్నాయి.