Rahul Gandhi Comments: లోకసభ ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రధానిగా నరేంద్రమోదీ పగ్గాలు చేపట్టే అవకాశాల్లేవని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఖనోజ్‌లో ఆయన సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌లో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. గత రెండు సంవత్సరాల నుంచి ఇండియా కూటమి బలోపేతం కోసం తాను ఎంతో కష్టపడ్డానని అన్నారు రాహుల్. గత రెండేళ్ల నుంచి తాను భారత్ జోడో యాత్ర, నఫ్రత్‌కీ బజార్ మే మొహోబత్ కి దుకాన్, న్యాయయాత్ర చేపట్టానని..దీంతో పాటు ఇండియా కూటమికి చెందిన పలు సమావేశాల్లో పాల్గొన్నానని రాహుల్ వివరించారు. 2024 లోకసభ ఎన్నికలు ముగిసిన తర్వాత నరేంద్రమోదీ ప్రధాని అయ్యే అవకాశాల్లేవని .. కావాలంటే తాను లిఖితపూర్వకంగా రాసిస్తానని రాహుల్ సవాలు విసిరారు.
తన ఇద్దరు మిత్రులు రక్షిస్తారని..(Rahul Gandhi Comments)
ఇదిలా ఉండగా ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, సమాజ్‌వాది పార్టీ… ఇండియా కూటమికి చెందిన ఇతర పార్టీల కార్యకర్తలు అందరూ కలిసి ఖనోజ్ లోకసభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న యాదవ్ విజయానికి కృషి చేయాలని కోరారు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ భారీ ఓటమిని చవిచూడబోతోంది. ఇక్కడి ప్రజలు బీజేపీకి ఓటు వేయరాదని నిర్ణయించుకున్నారని రాహుల్ అన్నారు. ఇక ప్రధాని మోదీ ఇటీవల అదానీ, అంబానీల గురించి చేసిన వ్యాఖ్యల గురించి ప్రస్తావిస్తూ రాహుల్ … గత పది సంవత్సరాల నుంచి ఆయన వేలాది ప్రసంగాలు చేసిఉంటారు. ఒక్క సభలో అయినా.. అదానీ, అంబానీల పేర్లు ప్రస్తావించారా అని ప్రశ్నించారు. ఎప్పుడైతే భయం పట్టుకుంటుందో అప్పుడు ఫలానా వ్యక్తి పేరు ప్రస్తావిస్తారనేది ఓ నానుడి. ఆ వ్యక్తి రక్షిస్తాడని భావిస్తారు. ఇక్కడ మోదీ విషయానికి వస్తే ఇప్పుడు తన ఇద్దరు మిత్రులు తనను రక్షించడానికి వస్తారని భావించే ఆయన వారిద్దరి పేర్లు ప్రస్తావించారని అన్నారు.
సంపన్నుల రుణాలు రూ.16 లక్షల కోట్లు మాఫీ
మోదీ ప్రభుత్వం మొత్తం 22 మంది సంపన్నుల రుణాలు సుమారు రూ.16 లక్షల కోట్లు మాఫీ చేసిందన్నారు. అయితే కాంగ్రెస్, ఇండియా కూటమిలు కలిసి మోదీ 22 మందిని బిలియనీర్లు చేస్తే.. కాంగ్రెస్ పార్టీ కోట్లాది మందిని మిలియనీర్లను చేయాలని నిర్ణయించుకుందన్నారు రాహుల్. ఎస్‌పీ పార్టీ ప్రెసిడెంట్ కూడా అయిన అఖిలేష్‌యాదవ్ ఖనోజ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. మొట్టమొదటి ఎన్నికల ర్యాలీ ఇదే అని ఆయన అన్నారు. తాను ఇక్కడి నుంచి పోటీ చేసినా.. చేయకపోయినా.. ఖనోజ్ ప్రజలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఇక్కడ అసలు విషయానికి వస్తే 2012లో ఆయన ఖనోజ్ సీటను ఖాళీ చేసి తన భార్య డింపుల్‌కు అప్పగించారు. కాగా ర్యాలీని ఉద్దేశించి ఆమ్ ఆద్మీపార్టీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సంజయ్‌సింగ్ కూడా ప్రసంగించారు. బీజేపీ అభ్యర్థికి డిపాజిట్ కూడా దక్కకుండా చూడాలని ఆయన ఓటర్లను కోరారు.