Site icon Prime9

Mitchell Starc: ఐపీఎల్‌ వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా మిచెల్ స్టార్క్

Mitchell Starc

Mitchell Starc

 Mitchell Starc:  ఐపీఎల్‌ వేలంలో ఆసీస్ పేసర్‌ మిచెల్ స్టార్క్‌ రికార్డు సృష్టించాడు. అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ మినీ వేలంలో ఆసీస్‌ ఆటగాడు మిచెల్‌ స్టార్క్‌ రికార్డు సృష్టించాడు. అతడి తర్వాత కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌ రెండో స్థానంలో నిలిచాడు.

చివరి వరకూ పోటీ..( Mitchell Starc)

ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధరను సొంతం చేసుకున్న ఆటగాడిగా నిలిచాడు. స్టార్క్‌ను కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ 24 కోట్ల 75 లక్షలకు దక్కించుకుంది. స్టార్క్ కోసం గుజరాత్‌ టైటాన్స్‌, కోల్‌కతా చివరి వరకు తీవ్రంగా పోటీ పడ్డాయి. స్టార్క్ ఢిల్లీ క్యాపిటల్స్ మరియు ముంబై ఇండియన్స్ లను కూడా ఆకర్షించాడు, అయితే బడ్జెట్ పరిమితుల కారణంగా ఈ రెండూ తప్పుకున్నాయి. గుజరాత్ టైటాన్స్ మరియు కోల్‌కతా నైట్ రైడర్స్ స్టార్క్ కోసం పోటీ పడ్డాయి. చివరకు కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ భారీ మొత్తంతో అతడిని సొంతం చేసుకుంది. ఆసీస్‌ కెప్టెన్‌ కమిన్స్‌ 20కోట్ల 50 లక్షలకు రెండో స్థానంలో నిలిచాడు. అతడిని సన్‌రైజర్స్‌ హైదరాబాద్ సొంతం చేసుకుంది. న్యూజిలాండ్‌ ఆల్‌రౌండర్‌ డారిల్‌ మిచెల్‌ను 14 కోట్లు పెట్టి చెన్నై సూపర్ కింగ్స్‌ సొంతం చేసుకుంది. భారత పేసర్‌ హర్షత్ పటేల్‌ను 11 కోట్ల 75 లక్షలకు పంజాబ్‌ కింగ్స్‌ సొంతం చేసుకుంది.

Exit mobile version