Site icon Prime9

Tamil Nadu: తప్పిన రైలు ప్రమాదం.. తమిళనాడులో ఏం జరిగిందంటే..

Missed train accident in Tamil Nadu

Tiruvallur: తమిళనాడులో రైలు ప్రమాదం తప్పింది. తిరువళ్లూరు వద్ద అర్ధరాత్రి చోటుచేసుకొన్న ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకొన్నారు. సమాచారం మేరకు. చెన్నై నుండి కోయంబత్తూరు వెళ్లుతున్న ఎక్స్ ప్రెస్ రైలు శనివారం అర్ధరాత్రి సమయంలో తిరువళ్లూరు దాటిన అనంతరం పెద్ద శబ్ధం చోటుచేసుకొనింది. రైలు బోగీలు ఎస్7, ఎస్8 రెండూ రైలు నుండి విడిపోయాయి. గుర్తించిన లోకో పైలట్ రైలును అనంతరం స్టేషన్ లో ఆపారు. ఈ క్రమంలో పట్టాలపై కొద్ది దూరం వెళ్లిన తర్వాత విడిపోయిన బోగీలు నిలిచిపోయాయి. విడిపోయిన కప్లింగ్ లను సరిచేసిన అధికారులు రైలును యధావిధిగా మార్గంలోకి మళ్లించారు.

ఇది కూడా చదవండి:Viral Video: జలపాతం అందంగా ఉంది.. కానీ దీని వెనుక కథ మాత్రం ఏడ్పించేసింది!

Exit mobile version