Minors marriage: ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ఇద్దరు మైనర్ పిల్లలకు ‘దుష్టశక్తులను దూరం చేసేందుకు’ వీధికుక్కలతో పెళ్లి చేశారు. 11 ఏళ్ల బాలుడు, తపన్ సింగ్ (దారీ సింగ్ కుమారుడు) ఆడ కుక్కను వివాహం చేసుకోగా, ఏడేళ్ల లక్ష్మి (బుటు కుమార్తె) ఒక మగ కుక్కతో వివాహం చేసుకుంది. స్థానికుల నమ్మకం ప్రకారం ఇలా చేయడం వలన దుష్టశక్తులు దూరం అవుతాయి.
వీరిద్దరు సోరో బ్లాక్‌లోని బంద్‌సాహి గ్రామానికి చెందిన హో గిరిజనులు. పిల్లలు పై దవడపై దంతాలు వచ్చిన తరువాత వారి పిల్లలను వివాహం చేసుకోవడానికి కుక్క కోసం గాలించారు. పిల్లల యొక్క పై దవడపై మొదటి దంతాలు కనిపించడం అశుభం అని గిరిజనులు నమ్ముతారు. సమాజ సంప్రదాయాల ప్రకారం, రెండు ‘వివాహాలు’ జరిగాయి. విందుతో పాటు ఉదయం 7 నుండి మధ్యాహ్నం 1 గంటవరకు ఆచారాలు కొనసాగాయని గ్రామానికి చెందిన 28 ఏళ్ల గ్రాడ్యుయేట్ సాగర్ సింగ్ చెప్పాడు. పెళ్లి అయిన తర్వాత జరిగే చెడు కుక్కలకి చేరుతుందని సమాజం విశ్వసిస్తోంది.ఇది ఎటువంటి శాస్త్రీయ ఆధారం లేదు, కానీ పెద్దలు చెప్పిన ఆచారంగా కొనసాగుతోందని అతను తెలిపాడు.