Site icon Prime9

Diwali Gift: దీపావళి గిఫ్ట్…తెచ్చి పెట్టింది కర్ణాటక మంత్రికి తంట…

The minister who distributed Diwali gifts got backlash on social media

The minister who distributed Diwali gifts got backlash on social media

Anand Singh: దీపావళి పండుగ గదా…మన పార్టీ ప్రజా ప్రతినిధులకు ఓ గిఫ్ట్ ఇవ్వాలని భావించాడు ఆ మంత్రి. ఇంకేముంది అమల్లో పెట్టేశాడు..చివరకి సోషల్ మీడియాలో చిక్కుకొని గిల గిల కొట్టుకున్న ఆ సంఘటన కర్ణాటకలో చోటుచేసుకొనింది. అది కాస్తా వివాదానికి దారితీసింది.

కర్ణాటక టూరిజం శాఖ మంత్రి ఆనంద్ సింగ్ తన నియోజక పరిధిలో కొత్తగా ఎన్నికైన స్థానిక సంస్థల సభ్యులకు విలువైన దీపావళి బహుమతులు ఇవ్వాలనుకొన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ సభ్యులకు ఒక రకమైన గిఫ్ట్, గ్రామ పంచాయతీ సభ్యులకు మరొక రకమైన గిఫ్ట్ లను ఇచ్చేందుకు రెడీ అయినాడు. మున్సిపల్ కార్పొరేషన్ సభ్యులకు పంపింన గిఫ్ట్ బాక్స్‌లో రూ.1 లక్ష నగదు, 144 గ్రాముల బంగారం, 1 కేజీ వెండి, ఒక సిల్క్ చీర్, ఒక ధోతీ, డ్రై ప్రూట్స్ బాక్స్ ఒకటి పంపించారు. గ్రామ పంచాయతీ సభ్యులకు పంపించిన బాక్స్‌లో బంగారం మినహాయించి కొంచెం నగదుతో మిగతా వాటినన్నింటినీ పంపించారు.

దీనిపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు ప్రారంభమైనాయి. అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని, ఉచితంగా ఎందుకిచ్చారని నెట్టింట మంత్రి ఆనంద్ రాజ్ కు ఆనందం లేకుండా చేశారు నెటిజన్లు.

ఇది కూడా చదవండి: Maharashtra Politics: షిండే పీఠంపై భాజపా కన్ను…సంచలన కధనం ప్రకటించిన ఉద్దవ్ శివసేన సామ్నా పత్రిక

Exit mobile version