Vande Bharat Rail: దేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వందే భారత్ రైలుకు స్వల్ప ప్రమాదం చోటు చేసుకొనింది. దీంతో రైలు ముందు భాగం దెబ్బతినింది. సమాచారం మేరకు, ముంబయి-గాంధీనగర్ మధ్య వందే భారత్ రైలు రాకపోకలు సాగిస్తుంది. ఈ క్రమంలో వత్వా, గైరత్ పూర్ స్టేషన్ మధ్య పట్టాలు దాటుతున్న గేదెల గుంపును రైలు ఢీ కొట్టింది. ఉదయం 11.20 గంటలకు ఈ ఘటన చోటుచేసుకొన్నట్లు పశ్చిమ రైల్వే ప్రతినిధి జేకే జయంత్ పేర్కొన్నారు.
ప్రమాదంలో రైలు ముక్కు భాగంలోని ఫైబర్ రీన్ఫోర్స్డ్ ప్లాస్టిక్ దెబ్బతినింది. ముఖ్య విభాగాలు ఏమీ దెబ్బతినలేదని రైల్వే వర్గాలు తెలిపాయి. ప్రమాదం జరిగిన 8 నిమిషాల అనంతరం రైలు యధావిధిగా నిర్ణీత మార్గంలో పయనించిందని తెలిపారు.
సెప్టెంబర్ 30 ప్రధాని మోదీ అహ్మదాబాద్ పర్యటనలో ముంబయి-గాంధీనగర్ సెమీ హైస్పీ రైలు పేరుతో వందే భారత్ 3వ రైలుకు పచ్చజెండా ఊపి ప్రారంభించారు. వందే భారత్ రైళ్లను దేశంలో వంద రైళ్లను ప్రవేశ పెట్టేందుకు కేంద్రం సమాయత్తమైంది.
ఇది కూడా చదవండి:Vande Bharat Express: సెమీ హైస్పీడ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ