Site icon Prime9

Manipur: మణిపూర్‌ లో చెలరేగిన హింస.. ఇంఫాల్ లో వాహనాలను తగలబెట్టి డిప్యూటీ కమీషనర్ కార్యాలయం ధ్వంసం చేసిన నిరసనకారులు

Manipur

Manipur

Manipur: మణిపూర్‌లో ఇద్దరు విద్యార్దుల మృతిపై హింసాత్మక నిరసనలు చెలరేగాయి. గురువారం తెల్లవారుజామున, రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రదర్శనలలో భాగంగా ఇంఫాల్ వెస్ట్‌లో ఒక గుంపు రెండు నాలుగు చక్రాల వాహనాలను తగులబెట్టింది . అంతేకాదు డిప్యూటీ కమీషనర్ కార్యాలయాన్ని ధ్వంసం చేసింది.

ఇంఫాల్ లో కర్ఫ్యూ..(Manipur)

బుధవారం రాత్రి, నిరసనకారులు ఉరిపోక్, యైస్కుల్, సగోల్‌బండ్ మరియు తేరా ప్రాంతాలలో భద్రతా సిబ్బందితో ఘర్షణ పడ్డారు, పరిస్థితిని నియంత్రించడానికి బలగాలు అనేక రౌండ్లు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించినట్లు అధికారులు తెలిపారు. భద్రతా బలగాలు నివాస ప్రాంతాల్లోకి రాకుండా ఉండేందుకు నిరసనకారులు టైర్లు, బండరాళ్లు, ఇనుప పైపులతో రోడ్లను దిగ్బంధించారు.ఈ ఘటనతో సీఆర్పీఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఇంఫాల్ తూర్పు మరియు పశ్చిమ రెండు జిల్లాలలో కర్ఫ్యూ మళ్లీ విధించబడింది. ఒక పోలీసు వాహనంపై దాడి చేసి నిప్పంటించారని, పోలీసుపై దాడి చేసి అతని ఆయుధాన్ని లాక్కున్నారని పోలీసులు చెబుతున్నారు. అటువంటి నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అపహరించిన ఆయుధాల రికవరీ మరియు నిందితుల అరెస్టు కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని వారు తెలిపారు. ఇదిలావుండగా, టీనేజర్లపై లాఠీచార్జి, టియర్ గ్యాస్ షెల్స్ మరియు రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించవద్దని మణిపూర్ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ భద్రతా బలగాలను కోరింది.

మే 3న మణిపూర్‌లో జాతి హింస చెలరేగినప్పటి నుండి 180 మందికి పైగా మరణించగా వందల మంది గాయపడ్డారు, షెడ్యూల్డ్ తెగ హోదా కోసం మెజారిటీ మైతీ కమ్యూనిటీ యొక్క డిమాండ్‌కు వ్యతిరేకంగా కొండ జిల్లాలలో ‘గిరిజన సంఘీభావ యాత్ర’ నిర్వహించబడింది. మణిపూర్ జనాభాలో మైతీలు దాదాపు 53 శాతం ఉన్నారు. వీరు ఎక్కువగా ఇంఫాల్ లోయలో నివసిస్తున్నారు. నాగాలు మరియు కుకీలతో సహా గిరిజనులు 40 శాతం ఉన్నారు . వీరు ఎక్కువగా కొండ జిల్లాలలో నివసిస్తున్నారు.

Exit mobile version
Skip to toolbar