Site icon Prime9

Manipur: మణిపూర్ లో హత్యకు గురైన ఇద్దరు మిస్సింగ్ విద్యార్దులు

Manipur

Manipur

Manipur: మణిపూర్ లో  జూలై 6 నుంచి అదృశ్యమైన ఇద్దరు  విద్యార్థుల చిత్రాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. హత్యకు ముందు, హత్య తర్వాత ఫోటోలు కనిపిస్తున్నాయి. ఒక చిత్రంలో ఇద్దరు విద్యార్థులు ఒక ప్రదేశంలో కూర్చున్నట్లు చూపించారు. వారి వెనుక ఇద్దరు సాయుధ వ్యక్తులు కనిపిస్తారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న మరో చిత్రంలో ఇద్దరు విద్యార్థుల మృతదేహాలు కనిపిస్తున్నాయి.

సీబీఐ కు కేసు అప్పగింత..(Manipur)

విద్యార్థులను 17 ఏళ్ల హిజామ్ లింతోంగంబి, 20 ఏళ్ల ఫిజామ్ హేమ్‌జిత్‌గా గుర్తించారు.చిత్రాలు ఆన్‌లైన్‌లో కనిపించిన తర్వాత, మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ విద్యార్థుల కిడ్నాప్ మరియు హత్యకు పాల్పడిన వారందరిపై వేగంగా మరియు నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటామని ప్రజలకు హామీ ఇచ్చారు.జూలై నుంచి తప్పిపోయిన ఇద్దరు విద్యార్థులు ఫిజామ్ హేమ్‌జిత్, 20, హిజామ్ లింతోంగంబి (17)ల ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమివ్వడం రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి వచ్చిందని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. రాష్ట్ర పోలీసులు, కేంద్ర భద్రతా సంస్థల సహకారంతో నేరస్థులను గుర్తించడానికి కేసును చురుకుగా దర్యాప్తు చేస్తున్నారు. నేరస్తులను పట్టుకునేందుకు భద్రతా బలగాలు కూడా సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయని ఆ ప్రకటన పేర్కొంది.ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి అప్పగించారు.

 

Exit mobile version