Site icon Prime9

Man Casts Vote by Foot: రెండు చేతులు లేకపోయినా కాలితో ఓటు వేసాడు.. ఎక్కడో తెలుసా?

Vote by Foot

Vote by Foot

Man Casts Vote by Foot: ఓటు హక్కుపై అధికారులు ఎన్నిరకాలుగా అవగాహన కల్పిస్తున్నప్పటికీ దేశంలోని పలు ప్రాంతాల్లో పోలింగ్ శాతం తక్కువగానే ఉంటోంది. నిరక్షరాస్యుల సంగతి అలా ఉంచితే విద్యావంతులు కూడా ఓటు వేయడానికి ముందుకు రావడం లేదు. పోలింగ్ నాడు సెలవుదినం కావడంతో ఇళ్లల్లోనే కాలక్షేపం చేయడం, ఇతరత్రా వ్యాపకాలతో మునిగితేలుతున్నారు. ఈ నేపధ్యంలో గుజరాత్ కు చెందిన ఒక వ్యక్తి తనకు రెండు చేతులూ లేకపోయినా కాళ్లతో ఓటు వేసి వార్తల్లో నిలిచాడు.

కరెంట్ షాకుతో రెండు చేతులు కోల్పోయి..(Man Casts Vote by Foot)

లోక్‌సభ ఎన్నికల 3వ దశ పోలింగ్ నేడు దేశ వ్యాప్తంగా 93 నియోజకవర్గాల్లో జరుగుతోంది.ఈ సందర్బంగా గుజరాత్‌లోని నాడియాడ్‌లోని పోలింగ్ బూత్‌లో రెండు చేతులు లేని అంకిత్ సోని అనే వ్యక్తి తన పాదాల ద్వారా ఓటు వేసాడు.అనంతరం అతను మీడియాతో మాట్లాడుతూ 20 ఏళ్ల క్రితం కరెంట్‌ షాక్‌తో తన రెండు చేతులు పోగొట్టుకున్నాన్నట్లు చెప్పాడు. తన గురువుల సహకారంతో డిగ్రీ పూర్త చేసానని చెప్పాడు. ప్రజలు బయటకు వచ్చి ఓటు వేయాలని అతను విజ్జప్తి చేసాడు.

నేడు అస్సాం (4), బీహార్ (5), ఛత్తీస్‌గఢ్ (7), దాద్రా మరియు నగర్ హవేలీ మరియు డామన్ మరియు డయ్యూ (2), గోవా (2), గుజరాత్ (25) ), కర్ణాటక (14), మహారాష్ట్ర (11), మధ్యప్రదేశ్ (8), ఉత్తరప్రదేశ్ (10) పశ్చిమ బెంగాల్ (4)లో పోలింగ్ కొనసాగుతోంది. 120 మంది మహిళలు సహా 1300 మందికి పైగా అభ్యర్థులు బరిలో ఉన్నారు. 1.85 లక్షల పోలింగ్ స్టేషన్లలో మొత్తం 17.24 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

Exit mobile version