Site icon Prime9

Odisha: భార్య అనుమతితో ట్రాన్స్ జెండర్ మహిళను పెళ్లి చేసుకున్న భర్త

odisha-man-marries-transgender

Bhubaneswar: ఒడిశాలోని ఒక వ్యక్తి తన భార్య అనుమతితో ట్రాన్స్ జెండర్ మహిళను పెళ్లి చేసుకున్నాడు. అతని భార్యవారి వివాహాన్ని అంగీకరించడమే కాకుండా, ఒకే ఇంట్లో కలిసి ఉండటానికి అంగీకరించింది. కలహండి జిల్లాలోని నార్లాలోని ఒక ఆలయంలో తన భార్య యొక్క ముందస్తు అనుమతితో ఒక ట్రాన్స్ ఉమెన్‌ని వివాహం చేసుకున్నాడు. ఆమె రెండేళ్ల కొడుకుతో  గత సంవత్సరం రాయగడ జిల్లాలోని అంబడోలాలో వీధిలో భిక్షాటన చేస్తున్నప్పుడు ట్రాన్స్‌ జెండర్ మహిళను కలిశాడు. మొదటి చూపులోనే ప్రేమలో పడ్డాడు. దీనితో ఆమె మొబైల్ నంబర్ తీసుకుని టచ్ లో ఉండేవాడు. ఒక నెల క్రితం, ఆ వ్యక్తి భార్యకు తన భర్త సదరు మహిళతో నిత్యం చేసే సంభాషణల గురించి తెలుసుకుంది. దీనిపై అతడిని అడగ్గా ఆమెతో తాను రిలేషన్ ఏర్పరచుకోవాలని భావిస్తున్నట్లు తెలిపాడు. దీనితో ఆమె అతని రెండవ వివాహానికి అంగీకరించింది.

తన భార్య ఆమోదం పొందిన తర్వాత అతను ఒక దేవాలయంలో ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ సభ్యులతో సహా పరిమిత అతిథుల సమక్షంలో వివాహాన్ని ఘనంగా జరుపుకున్నాడు. నా భార్య కూడా సంతోషంగా ఉంది. చట్టం గురించి మాకు ఆందోళన లేదు” అని ఆ వ్యక్తి చెబుతున్నాడు.

Exit mobile version
Skip to toolbar