Site icon Prime9

Trending News : 50 కి.మీ తల్లి మృతదేహాన్ని భుజాలపై మోసుకెళ్లిన కుమారుడు… ఎక్కడంటే ?

man carries mother dead body and walk 50 kilometers

man carries mother dead body and walk 50 kilometers

Trending News : రోజులు మారుతున్నాయి… ప్రజలు మారుతున్నారు… ప్రభుత్వాలు మారుతున్నాయి. కానీ ఇలాంటి గుండె తరుక్కుపోయే ఘటనలు మాత్రం ఆగడం లేదు. మన తాతలు, తండ్రులు చెప్పిన మతలనే మనం ఇప్పటికీ చెబుతున్నాం. భవిష్యత్తులో అవే మాటలు మన పిల్లాఉ కూడా చెబుతారేమో అనే భయం ప్రస్తుతం అందరిలో ఉంది. “అదే భారతదేశం అభివృద్ది చెందుతుంది అని”. కొన్ని దశాబ్దాలుగా ఇదే చెబుతున్నాం… ఇంకా చెబుతూనే ఉన్నాం. కానీ కొన్ని ఘటనలు మాత్రం ఇంక జరగకుండా చూసుకోవడంలో విఫలం అవుతున్నాం. కుటుంబ సభ్యులు, ఆప్తులు మరణించినప్పుడు ఆ బాధ వర్ణనాతీతం. అలాంటి దుఖ సమయంలో వారి పార్ధివ దేహాన్ని కూడా ఇంటికి తీసుకెళ్లడానికి… ఆస్పత్రుల్లో ప్రజలకు అందుబాటులో ఉండే వసతులు లేకపోవడం నిజంగా చింతించాల్సిన విషయం.

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అయిన వాళ్ళు చనిపోతే… వారి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు కూడా డబ్బులు డిమాండ్ చేస్తే… అడిగినంత ఇవ్వాల్సిందేనని పట్టుబడితే… అలాంటి వాళ్ళని ఏం అనాలో మాటలు రావడం లేదు. సాధారణంగా అయితే మనుషులు అని అయితే అనలేము. తాజాగా అలాంటి మరోసారి జరిగింది. తల్లి మృతదేహాన్ని అంబులెన్స్ లో తరలించేందుకు… డబ్బు లేకపోవడంతో ఓ యువకుడు ఆమె పార్ధివ దేహాన్ని భుజాలపై… సుమారు 50 కి.మీ మోసుకొని వెళ్ళడం విచారకరం.

పశ్చిమ బంగ రాష్ట్రంలోని జల్​పాయ్​గుడీ క్రాంతి బ్లాక్​కు చెందిన రాంప్రసాద్… రోజూవారి కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇతని తల్లి లక్ష్మీరాణి శ్వాశకోశ వ్యాధులతో బాధపడేది. ఆమెకు చికిత్స అందించేందుకు రాంప్రసాద్… జలపాయ్​గుడీలోని ఓ ఆసుపత్రిలో చేర్పించాడు. ఈ క్రమంలో ఆమె చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. తల్లి మృతదేహాన్ని ఇంటికి తరలించేందుకు ప్రైవేట్ అంబులెన్స్​ను కోరాడు. రూ.3 వేలు ఇస్తే మృతదేహాన్ని ఇంటి దగ్గర దింపుతానని అంబులెన్స్ డ్రైవర్ చెప్పాడు. అయితే తన వద్ద అంత డబ్బు లేదని, చెప్పి వేడుకున్నాడు. అయినా అతని మనసు కరగలేదు.

దీంతో చేసేదేమీ లేక తల్లి మృతదేహాన్ని తండ్రితో కలిసి భుజంపై మోసుకెళ్లాడు. ఇంతలో వీరిని ‘గ్రీన్ జల్​పాయ్​గుడీ’ అనే స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి అంకుర్ దాస్ గమనించారు. వెంటనే ఆ సంస్థకు చెందిన అంబులెన్స్​ను తెప్పించి అందులో మహిళ మృతదేహాన్ని తరలించారు. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు ఘటనను సీరియస్ గా తీసుకున్నారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇంక భవిష్యత్తుల్లో ఇంకెప్పుడూ ఇలాంటి ఘటనలు జరగుకండా చూసుకుంటామని చెప్పారు.

Exit mobile version