Letter to Rahul Gandhi: మా తాతను మంత్రిని చేయండి.. రాహుల్ గాంధీకి లేఖ రాసిన కర్ణాటక కాంగ్రెస్ నేత మనవరాలు

కర్ణాటక కాంగ్రెస్ నేత టీబీ జయచంద్ర మనవరాలు తన తాతను మంత్రిని చేయాలని రాహుల్ గాంధీకి లేఖ రాసింది.  ఇటీవల జరిగిన కర్నాటక మంత్రివర్గ విస్తరణలో తన తాతయ్యకు చోటు దక్కకపోవడంతో జయచంద్ర మనవరాలు ఆర్ణా సందీప్ రాహుల్ గాంధీకు లేఖ రాసింది.

  • Written By:
  • Publish Date - May 28, 2023 / 07:15 PM IST

Letter to Rahul Gandhi: కర్ణాటక కాంగ్రెస్ నేత టీబీ జయచంద్ర మనవరాలు తన తాతను మంత్రిని చేయాలని రాహుల్ గాంధీకి లేఖ రాసింది.  ఇటీవల జరిగిన కర్నాటక మంత్రివర్గ విస్తరణలో తన తాతయ్యకు చోటు దక్కకపోవడంతో జయచంద్ర మనవరాలు ఆర్ణా సందీప్ రాహుల్ గాంధీకు లేఖ రాసింది.

మా తాత సమర్దుడు.. కష్టపడే వ్యక్తి..(Letter to Rahul Gandhi)

ఆర్నా తన లేఖలో ప్రియమైన రాహుల్ గాంధీ, నేను టిబి జయచంద్ర మనవరాలిని. మా తాత మంత్రి కాలేదని బాధపడ్డాను. అతను దయగలవాడు, సమర్థుడు మరియు కష్టపడే వ్యక్తి కాబట్టి ఆయన మంత్రి కావాలని కోరుకుంటున్నాను. అంతవరకూ రాసి తరువాత స్మైలీ స్టిక్కర్‌ను అతికించి తన లేఖను ముగించింది.కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విస్తరించిన మంత్రివర్గం శనివారం (మే 27) ప్రమాణ స్వీకారం చేయగా, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు టిబి జయచంద్రకు కేబినెట్ మంత్రుల జాబితాలో చోటు దక్కలేదు.

కుంచిటిగ సామాజికవర్గానికి ప్రాతినిధ్యం కల్పించకపోవడంతో తమకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ టిబి జయచంద్ర మద్దతుదారులు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇంటి ముందు బైఠాయించారు.అసంతృప్తితో ఉన్న జయచంద్ర పార్టీ హైకమాండ్‌ను కలిసి న్యాయం చేయాలని కోరారు.కేవలం జయచంద్రే కాదు, సిద్ధరామయ్య ప్రభుత్వంలో మంత్రి పదవి రాని పలువురు సీనియర్ శాసనసభ్యులలో అసంతృప్తి బెంగళూరులోని రాజ్‌భవన్ వెలుపల నిరసన రూపంలో చెలరేగింది. శాసనసభ్యుల మద్దతుదారులు మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన గవర్నర్ నివాసం వెలుపల నినాదాలు చేశారు.