Mahua Moitra: ‘క్యాష్ ఫర్ క్వరీ’ కేసుకు సంబంధించి లోక్‌సభ ఎంపీగా బహిష్కరించబడిన తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) నేత మహువా మొయిత్రా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.తన బహిష్కరణ నిర్ణయం చట్టవిరుద్ధం అంటూ తన పిటిషన్ లో పేర్కొన్నారు.
రూల్స్ ఉల్లంఘన..( Mahua Moitra)
డిసెంబర్ 8న, వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుండి బహుమతులని పొందడం ద్వారా మొయిత్రాను దోషిగా నిర్ధారించిన ఎథిక్స్ కమిటీ నివేదికను సభ ఆమోదించిన తర్వాత ఆమె లోక్‌సభ నుండి బహిష్కరించబడ్డారు. ఈ ఆరోపణలను మొయిత్రా తీవ్రంగా ఖండించారు. ఎథిక్స్ కమిటీ మరియు దాని నివేదిక పుస్తకంలోని ప్రతి నియమాన్ని ఉల్లంఘించాయి అని ఆమె ఆరోపించారు.ప్రతిపక్షాన్ని బుల్‌డోజ్ చేయడానికి ఇది ఆయుధం గా మారిందని అన్నారు.తనకు నగదు లేదా బహుమతి ఇచ్చినట్లు ఎలాంటి ఆధారాలు లేవని ఆమె విలేకరులతో అన్నారు.జాతీయ భద్రతపై ప్రభావాన్ని చూపే అనధికార వ్యక్తులతో లోక్‌సభ సభ్యుల పోర్టల్‌లోని యూజర్ ఐడి మరియు పాస్‌వర్డ్‌లో ఆమె లోక్‌సభ ఆధారాలను పంచుకోవడం ద్వారా మొయిత్రా అనైతిక ప్రవర్తన మరియు సభను ధిక్కరించినట్లు ఎథిక్స్ కమిటీ నివేదిక నిర్ధారించిందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు.
లోక్‌సభ నుంచి మొయిత్రా బహిష్కరణను ఖండించిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇది ప్రజాస్వామ్య హత్య అని అన్నారు.ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి అవమానం. మహువా మోయిత్రా బహిష్కరణను మేము ఖండిస్తున్నాము; పార్టీ ఆమెకు అండగా నిలుస్తుంది. ఎన్నికల్లో మమ్మల్ని ఓడించలేక బిజెపి ప్రతీకార రాజకీయాలకు పాల్పడిందని అన్నారు.