Mahua Moitra:టిఎంసి ఎంపి మహువా మొయిత్రా పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేశారు. డబ్బులు తీసుకుని ప్రశ్నలడిగారని మహువా మొయిత్రాపై ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఎథిక్స్ కమిటీ విచారణ జరిపి నివేదిక సమర్పించింది. ఎంపిగా ఉన్న మహువా మొయిత్రా తన పాస్‌వర్డ్, లాగిన్ ఐడిని ఇతరులకిచ్చారని నిర్థారించారు. ఈ నివేదికపై పార్లమెంట్ చర్చించింది. చివరికి మహువా మొయిత్రా లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఎథిక్స్ కమిటీ సిఫారసు..(Mahua Moitra)
పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని మూజువాణి ఓటు ద్వారా ఆమోదించారు.శుక్రవారం ఉదయం లోక్‌సభలో సమర్పించిన ఎథిక్స్ కమిటీ తన నివేదికలో ఆమెను లోక్ సభ నుంచి బహిష్కరించాలని సిఫారసు చేసింది.లోక్‌సభలో తీవ్ర చర్చ జరిగిన తర్వాత మహువా మొయిత్రా బహిష్కరణకు గురయ్యారు.లోక్‌సభలో చర్చ జరిగిన తర్వాత మహువా మోయిత్రా బహిష్కరణకు గురయ్యారు.ఎథిక్స్ ప్యానెల్ నివేదికను అధ్యయనం చేయడానికి మరింత సమయం కావాలని కాంగ్రెస్‌కు చెందిన అధిర్ రంజన్ చౌదరితో సహా ప్రతిపక్ష ఎంపీలు కోరారు. మహువా మొయిత్రాను సభలో ప్రసంగించేందుకు అనుమతించాలని ప్రతిపక్షం డిమాండ్ చేసింది. ఈ అభ్యర్థనను స్పీకర్ ఓం బిర్లా తిరస్కరించారు.మహువా మొయిత్రాపై ఆరోపణలను బిజెపి ఎంపి నిషికాంత్ దూబే లేవనెత్తారు. వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుండి నగదు మరియు బహుమతులకు బదులుగా మొయిత్రా పార్లమెంటులో ప్రశ్నలు అడిగారని ఆరోపించారు. మొయిత్రా మరియు హీరానందాని మధ్య జరిగిన చర్చలకు సాక్ష్యం గా న్యాయవాది జై అనంత్ దేహద్రాయ్ లేఖను పేర్కొన్నారు.