Devendra Fadnavis: దేవేంద్ర ఫడ్నవీస్.. మహారాష్ట్ర రాజకీయాల్లో చాలా పెద్ద పేరు. గతంలో సీఎంగా ఇపుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. దేశంలోని పలు ప్రాంతాల ప్రజలకు కూడా ఈ పేరు సుపరిచితమే. అయితే ఫడ్నవీస్ మహారాష్ట్ర చంద్రాపూర్ జిల్లాలో డిప్యూటీ సీఎంగా కాకుండా కొన్ని ‘విచిత్రమైన’ కారణాల వల్ల బాగా ప్రాచుర్యం పొందుతున్నారు.
ఫోటో తప్ప వివరాలన్నీ కరెక్టే..(Devendra Fadnavis)
చంద్రపూర్ జిల్లాలోని సిందేవాహి తాలూకా విర్వ గ్రామంలో నివసించే ఎనిమిదేళ్ల బాలుడు జిగల్ జీవన్ సవాసకడే ఆధార్ కార్డు పై అతని వివరాలన్నీ సక్రమంగా ఉన్నాయి. అయితే ఫోటో వద్ద అతనిది బదులుగా డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ ఫోటో ఉంది. ఈ రోజుల్లో ప్రభుత్వ పధకాలన్నింటికీ ఆధార్ తప్పనిసరి అయిన విషయం తెలిసిందే. దీనితో పనులన్నిఈ గుర్తింపుపైనే జరుగుతున్నాయి. ఫోటో సమస్య పరిష్కరించేందుకు ఈ బాలుడి తల్లి ప్రయత్నాలు చేస్తోంది.
నాకు ఈ కార్డుపై నా కొడుకు ఫోటో ఫడ్నవీస్ లా కనిపిస్తోంది. అధికార యంత్రాంగం తప్పిదం వల్ల ఇలా జరిగింది. దీనిని సరిచేసి మరలా కొత్త కార్డు జారీ చేయాలని బాలుడి తల్లి కోరుతోంది. ప్రస్తుతం ఈ బాలుడి ఆధార్ ఇక్కడ చర్చనీయాంశంగా మారింది.