Site icon Prime9

Maharashtra: ప్రియురాలిని కారుతో ఢీకొట్టిన మహారాష్ట్ర అధికారి కొడుకు

Maharashtra

Maharashtra

Maharashtra:మహారాష్ట్రలోని థానేలో తన ప్రియుడు కారుతో తనను ఢీకోట్టడానికి ప్రయత్నించడంతో తీవ్రంగా గాయపడినట్లు ప్రియా సింగ్ అనే యువతి తెలిపింది. మహారాష్ట్ర ప్రభుత్వంలో బ్యూరోక్రాట్ కొడుకు అయిన తన బాయ్‌ఫ్రెండ్ తనను కొట్టి, గొంతు కోసి చంపడానికి ప్రయత్నించాడని ఇన్ స్టా గ్రామ్ పోస్ట్ లో తెలిపింది.

యువతి బాయ్‌ఫ్రెండ్ అశ్వజిత్ గైక్వాడ్ మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ గైక్వాడ్ కుమారుడు.దాదాపు ఐదేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్న అశ్వజిత్‌ నుంచి మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు కుటుంబ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా తనకు ఫోన్ వచ్చిందని ప్రియా చెప్పింది.ఈ సంఘటన సోమవారం తెల్లవారుజామున 4.30 గంటలకు ఘోడ్‌బందర్ రోడ్‌లోని ఒక హోటల్ సమీపంలో జరిగింది. అక్కడ మహిళ అశ్వజిత్ గైక్వాడ్‌ను కలవడానికి వెళ్ళింది. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తరువాత బాధితురాలు అతని కారు నుండి ఆమె వస్తువులను తీసుకుని బయలుదేరడం ప్రారంభించినప్పుడు వాహనం నడుపుతున్న వ్యక్తి ఆమెను ఢీకొట్టడానికి ప్రయత్నించడంతో కిందపడిపోయి తీవ్ర గాయాలపాలయిందని పోలీసు అధికారి తెలిపారు.

కాలు విరిగింది..(Maharashtra)

నా బాయ్‌ఫ్రెండ్ నన్ను కొట్టాడు, నా మెడ గొంతు నొక్కడానికి ప్రయత్నించాడు. నేను అతనిని దూరంగా నెట్టడానికి ప్రయత్నించాను. అతను నా చేయి కొరికాడ. నన్ను కొట్టాడు. నా జుట్టును లాగాడు. అతని స్నేహితుడు నన్ను నేలపైకి తోసాడు అని ప్రియా సింగ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంది.నా కుడి కాలు విరిగింది.నేను శస్త్రచికిత్స చేయించుకోవలసి వచ్చింది. నా కుడి కాలుకు రాడ్ పెట్టవలసి వచ్చింది.నా శరీరమంతా గాయాలు ఉన్నాయని చెప్పింది. ఆమె కథనాన్ని సోషల్ మీడియాలో ఉంచిన తర్వాత థానేలోని కసర్వాడవ్లి పోలీస్ స్టేషన్‌లో అశ్వజిత్ గైక్వాడ్ మరియు డ్రైవర్‌తో సహా మరో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేసారు. ఈ సంఘటనపై దర్యాప్తు జరుగుతోందని ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని పోలీసులు తెలిపారు.

 

Exit mobile version