Madhya Pradesh: మధ్యప్రదేశ్ లో మెట్ల బావి కూలిన దుర్ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ సంఘటనలో ఇప్పటివరకు 35 మంది ప్రాణాలు కోల్పోయారు. గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు అక్కడి అధికారులు వెల్లడించారు. ఇండోర్ లోని బాలేశ్వర్ మహాదేవ్ ఆలయలో గురువారం జరిగిన నవమి వేడుకలో ఈ ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. పటేల్ నగర్ ప్రాంతంలో ఉన్న ఈ పురాతన ఆలయంలో రామనవమి వేడుకలకు పెద్ద ఎత్తున్న భక్తులు హాజరయ్యారు.
దీంతో ఆలయం ప్రాంగణంలో స్థలం సరిపోకపోవడంతో.. ఉన్న మెట్టబావి పైకప్పుపై కూర్చున్నారు. దీంతో బరువు ఆపుకోలేక బావి పై ఫ్లోరింగ్ ఒక్కసారిగా కప్పుకూలింది. దీంతో పైన కూర్చున్న దాదాపు 50 మందికి పైగా భక్తులు బావిలో పడిపోయారు. సమచారం తెలుసుకున్న ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టారు. 16 మందిని రక్షించగా.. వారు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. కాగా, ఇప్పటి వరకు 35 మంది మృతదేహాలను బావిలో నుంచి వెలికితీసినట్టు స్థానిక కలెక్టర్ వెల్లడించారు. గల్లంతైన మిగిలిన వారి కోసం గాలింపు కొనసాగుతోంది.
బాలేశ్వర మహాదేవ్ ఆలయం వందేళ్ల చరిత్ర కలిగింది. ఈ ఆలయం ప్రైవేటు ట్రస్ట్ ఆధీనంలో నడుస్తోంది. ఆలయ ప్రాంగణంలో 50 అడుగులు లోతు మెట్ల బావి ఉంది. నాలుగు దశాబ్ధాల క్రితం ఆ బావిని మూసేశారు. అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా బావి పైన శ్లాబుతో ఫ్లోరింగ్ చేసి ఆలయాన్ని నిర్మించారు. ఆ విషయం చాలా మంది బావి ఉన్న ప్రాంతంలో కూర్చునేసరికి బరువు మోపలేక.. నేల కుంగిపోయి ఈ దుర్ఘటన చోటు చేసుకుందని స్థానిక అధికారులు వెల్లడించారు.
ఈ ఘోర ప్రమాదంపై స్పందించిన సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్.. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా పరిహారం చెల్లించనున్నట్టు ప్రకటించారు. గాయపడిన వాళ్లకు రూ. 50 వేల రూపాయల పరిహారం చెల్లించాలని, హాస్పిటల్ ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. అదే విధంగా ఈ సంఘటనపై మెజిస్ట్రేట్ విచారణకు ఆదేశించారు. మరో వైపు ప్రధానమంత్రి ఎన్ఆర్ఎఫ్ నుంచి మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల ఎక్స్ గ్రేషియా.. గాయపడిన వాళ్లకు రూ. 50 వేలు ప్రకటించింది.