Site icon Prime9

Narottam Mishra: హేమమాలిని చేత డ్యాన్స్ చేయించాను.. అభివృద్ది కార్యక్రమంగా చెప్పుకున్న మధ్యప్రదేశ్ మంత్రి నరోత్తమ్ మిశ్రా

Narottam Mishra

Narottam Mishra

Narottam Mishra: మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా తన నియోజకవర్గం దాతియా కోసం హేమ మాలిని డ్యాన్స్‌ను ఒక అభివృద్ది కార్యక్రమంగా లెక్కిస్తూ చేసిన ప్రసంగం యొక్క వీడియో వైరల్ కావడంతో వివాదాస్పదమైంది. నరోత్తమ్ మిశ్రా ఎన్నికల ప్రచార సభలో తాను చేసిన అభివృద్ధి పనులను వివరించారు. దాతియాలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా ‘హేమమాలినితో డ్యాన్స్ కూడా చేయించామని చెప్పారు.

సొంత పార్టీ ఎంపీని వదల్లేదు..(Narottam Mishra)

దాదియా నుంచి నరోత్తమ్ మిశ్రా మూడు సార్లు గెలిచారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనాల్గవసారి పోటీ చేస్తున్నారు. అయితే అభివృద్ది కార్యక్రమాలను, హేమమాలిని డ్యాన్స్ కు ముడిపెడుతూ మిశ్రా చేసిన వ్యాఖ్యలపై పలువురు విమర్శలు గుప్పించారు. సీనియర్ కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ దీనిపై సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ X లో ఈ విధంగా స్పందించారు. నరోత్తమ్ మిశ్రా తన సొంత పార్టీ ఎంపీని కూడా వదిలిపెట్టలేదు. మహిళల పట్ల గౌరవనీయులైన సంస్కారీ బీజేపీ మంత్రి యొక్క అసలు నీచత్వం వినండి అని దిగ్విజయ్ సింగ్ వీడియోను షేర్ చేస్తూ ట్వీట్ చేశారు. హేమమాలిని బీజేపీ తరపున ఉత్తరప్రదేశ్ లోని మధుర నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీకి నవంబర్ 7న ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్న ఈ రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య హోరాహోరీ పోరు సాగడంతో ప్రచారం తీవ్ర స్థాయికి చేరుకుంది.

 

Exit mobile version