Site icon Prime9

Lungi politics in odisha: ఒడిషాలో లుంగీ పాలిటిక్స్..

odisha

odisha

Lungi politics in odisha: ఎన్నికలు సమీపించే కొద్ది ఒడిషాలో లుంగీ పాలిటిక్స్‌ ఊపందుకున్నాయి. రాష్ర్టంలో అసెంబ్లీతో పాటు లోకసభ ఎన్నికలు ఒకే సారి జరుగనున్నాయి. కాగా లుంగీ పాలిటిక్స్‌కు తెరతీసింది మాత్రం ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ అని చెప్పుకోవచ్చు. సాధారణంగా ఒడిషాలో ప్రజలు లుంగీలు ధరించరు. లుంగీలు ధరిస్తే చులకనగా చూస్తారు. అయితే మంగళవారం నాడు బిజూ జనతాదళ్‌ నాయకులు సస్‌మిత్‌ పాత్రా, స్వయం ప్రకాశ్‌ మహాపాత్ర బీజేపీ ప్రధాన కార్యాలయం సంఖా భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఇద్దరు నాయకులు సంప్రదాయబద్దంగా కనిపించే కుర్తా, పైజామా లేదా ప్యాంట్‌, షర్టు కాకుండా లుంగీలతో కనిపించడంతో మీడియా ప్రతినిధులు ఆశ్చర్యపోయారు. కాగా దేశంలోని కొన్ని ప్రాంతాల్లో లుంగీ ధరించడం సౌకర్యవంతంగా ఉంటుంది. ముఖ్యంగా దక్షిణాదితో పాటు ఈశాన్య ప్రాంత ప్రజలు లుంగీలు ధరిస్తుంటారు. అయితే బీజేడీకి చెందిన ఇద్దరు నాయకులు లుంగీలు ధరించడానికి గల కారణాలను మీడియా సోదరులకు వినిపించారు.

లుంగీ ధరించి ప్రచారం..(Lungi politics in odisha)

బీజేపీ నాయకుడు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఒడిషా ముఖ్యమంత్రి బీజేడీ సుప్రీమో నవీన్‌ పట్నాయక్‌ను ఓటర్ల ముందు ఎద్దేవా చేశారు. దీనికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ బీజేడీకి ఓటు వేయాలని ఓ వీడియో మెసేజ్‌లో ఓటర్లను కోరారు. ఈ మెసేజ్‌లో ఆయన జోడా శంకాస్‌ అంటే రెండు శంఖాలు.. బీజేడీ ఎన్నికల గుర్తు రెండు శంఖాలు అంటే ఒకటి ఎంపీ, రెండోది ఎమ్మెల్యేకు ఓటు వేయాలని ఆయన అభ్యర్ధించారు.ఈ వీడియోలో ఆయన లుంగీ ధరించి ఉండటం విశేషం. ఒడిషా అసెంబ్లీకి లోకసభకు ఒకటే సారి ఎన్నికలు జరుగనున్నాయి. కేవలం నవీన్‌ పట్నాయక్‌ కాదు ఆయన సన్నిహితులు వీకె పాండియన్‌ వీడియోలు కూడా ప్రస్తుతం హల్‌చల్‌ చేస్తున్నాయి. కాగా పాండియన్‌ విషయానికి వస్తే ఆయన తమిళనాడుకు చెందిన వారు. అయితే ఆయన మాత్రం లుంగీ ధరించలేదు.

అయితే ఒడిషాలో ప్రజలు సాధారణంగా లుంగీలు కట్టుకున్నా ఇంటికే పరిమితం అవుతారు. దక్షిణాది మాదిరిగా ఇక్కడి ప్రజలు లుంగీలను ఎక్కువగా ధరించారు. అదీ కాకుండా లుంగీ ధరించిన వారిని చులకనగా చూస్తారు. ఒరియా ప్రజలు లుంగీలు ధరించినా.. రోడ్లపైకి రారు. నవీన్‌ పట్నాయక్‌ లుంగీ కట్టుకొని ప్రజల్లోకి రావడాన్ని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ స్పందించారు. నవీన్‌ బాబును మీరందరూ చూసే ఉంటారు. పెద్ద మనిషి, ముఖ్యమంత్రి అలాంటి వ్యక్తి పైజామా, కుర్తా వేసుకొని రావాలి కానీ.. లుంగీ వేసుకొని రావడం ఏమిటని నిలదీశారు. అయితే ఆయన పక్కనే ఉన్న పాండియన్‌ గురించి మాత్రం ఆయన ప్రస్తావించలేదు. కాగా పాండియన్‌ ఒడిషా క్యాడర్‌కు చెందిన ఐఎఎస్‌ అధికారి. ప్రస్తుతం ఒడిషాలో లుంగీ పాలిటిక్స్‌ ఊపందుకున్నాయి. ఈ సందర్భంగా షారూక్‌, దీపికా పదుకొనే చెన్నై ఎక్స్‌ప్రెస్‌ పాట లుంగీ డాన్స్‌ పాటను ఇక్కడి ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.

Exit mobile version