New Delhi: దేశ ప్రజలంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సుప్రీం కోర్టు ప్రత్యక్ష్య ప్రసారాల వీక్షణ ఎట్టకేలకు ప్రారంభమైంది. చీఫ్ జస్టిస్ యు.యు. లలిత్ అండ్ టీం ఆధ్వర్యంలో తొలిసారిగా ప్రత్యక్ష్య ప్రసారాలను సర్వోత్తమ న్యాయస్థానం అందుబాటులోకి తీసుకొచ్చింది. రాజ్యాంగ ధర్మాసనం కేసులను మాత్రమే ప్రత్యక్ష్య ప్రసారాల ద్వార వాదోపవాదాలు వీక్షించే సౌకర్యాలు ఏర్పాటు చేసారు. అంచలంచలుగా మిగిలిన ధర్మాసనాల కేసులను కూడా లైవ్ స్ట్రీమింగ్ లోకి సుప్రీం కోర్టు తీసుకురానుంది.
నేడు మూడు, నాలుగు కేసులను సుప్రీం కోర్టు విచారించే అవకాశాలు ఉన్నాయి. తొలి కేసుగా మహారాష్ట్రలో చోటుచేసుకొన్న సంకీర్ణ ప్రభుత్వం పడిపోవడం, ఓ వర్గంలోని వారంతా తిరుగుబాటు వర్గంగా ఏర్పడడం వంటి అంశాలతో శివసేన-ఏక్ నాధ్ షిండే ల కేసును ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రత్యక్ష్య ప్రసారాలపై 2018లోనే సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకొన్నప్పటికీ ఆచరణలో తెలుగు వాడైన జస్టిస్ ఎన్.వి. రమణ పదవీ విరమణ చేసిన గత నెల ఆగస్ట్ 26న ఆయన నేతృత్వంలో జరిగిన ధర్మాసనం కార్యకలాపాలను వెబ్ కాస్ట్ ద్వార దేశ ప్రజలంతా వీక్షించే ఏర్పాట్లు చేసి ప్రత్యక్ష్య ప్రసారాలకు అంకురార్పణ పడింది.
అంనతరం నేడు పూర్తి స్థాయిలో రాజ్యాంగ ధర్మాసనం కేసులను ప్రత్యక్ష్య ప్రసారాల ద్వారా విచారణకు శ్రీకారం చుట్టారు. త్వరలో ప్రత్యేక సాంకేతికత వ్యవస్ధ కూడా సర్వోత్తమ న్యాయస్ధానం అందుబాటులోకి తేనుంది. అప్పటివరకు యూట్యూబ్ వంటి ఛానల్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ ను ఇచ్చేలా ప్రయత్నాలు కూడా చేసారు. అయితే కోర్టు వ్యవహారాలను ప్రైవేటు సంస్ధలకు ఇవ్వడం అనే అంశం పై వాదనలు కూడా చోటుచేసుకొన్నాయి. దీనిపై నిన్నటిదినం సుప్రీం కోర్టు పిటిషనర్ కు కొన్ని విషయాలు కూడా తెలియచేసింది. కేవలం ప్రత్యేక సాంకేతికత అందుబాటులోకి వచ్చేంత వరకు మాత్రమే యూట్యూబ్ సేవలను పొందుతున్నట్లు ధర్మాసనం పేర్కొనింది. కాపీ రైట్ పై తగిన జాగ్రత్తలు తీసుకొంటామంటూ విచారణను వచ్చేనెల 17కు వాయిదా వేసింది.
ఆర్థికంగా వెనుకబడిన వర్గాల రిజర్వేషన్‌ను సవాలు చేస్తూ వచ్చిన అప్పీళ్ల విచారణ, మహారాష్ట్రలో రాజకీయ వివాదం, కేంద్రం ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వం మధ్య సేవా నియంత్రణపై వివాదాల పై ప్రత్యక్ష్య ప్రసారాలు జరగనున్నాయి.
ఇది కూడా చదవండి: మరోసారి ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్ వాయిదా