Site icon Prime9

Central Pollution Control Board: అత్యంత కాలుష్య నగరాల జాబితా విడుదల.. తెలుగు రాష్ట్రాల్లో 6 నగరాల్లో కాలుష్య భూతం

List of the most polluted cities has been released... 6 cities in Telugu states are polluted

Delhi: పచ్చని పల్లెలు కనుమరుగౌతున్నాయి. నగరాలు శరవేగంగా పెరుగుతున్నాయి. పారిశ్రామీకరణ కారణంగా దేశంలోని చిన్న నగరాలను కాలుష్యం చిదిమేస్తోంది. దేశ రాజధాని ఢిల్లీ మాత్రమే కాలుష్యం కోరల్లో చిక్కిందని పదే పదే వింటుంటాం. కాని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (సీపీసీబీ) దేశంలోని అత్యంత కాలుష్య నగరాల జాబితాను విడుదల చేసింది. దీంతో అనేక నగరాలు కాలుష్యం బారిన పడుతున్నాయని తెలుస్తోంది.

మొత్తం 163 నగరాలకు సంబంధించిన గాల నాణ్యత ప్రమాణాల వివరాలను అందులో తెలిపారు. కాలుష్యం కోరల్లోని ప్రధమంగా బీహార్ లోని కతిహార్ నగరం గాలి నాణ్యత 360 పాయింట్లకు పడిపోయిన్నట్లు సీపీసీబీ తన నివేదికలో పేర్కొంది. ఢిల్లీ 354 పాయింట్లు, నోయిడా 328 పాయింట్లు, ఘజియాబాద్ 304 పాయింట్లుగా గాలి నాణ్యత నమోదైయ్యాయి. వీటితో పాటు బీహార్ లోని బెగుసరాయ్, హరియాణాలోని బల్లాబ్ ఘర్, ఫరిదాబాద్, కైత్వాల్, గుడ్ గావ్, మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ నగరాలు అత్యంత కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు నిర్ధారించింది.

ఇక తెలుగు రాష్ట్రాలు కూడా కాలుష్య కోరల జాబితాలో చేరాయి. మొత్తం 6నగరాలు కాలుష్యం కోరల్లో చిక్కుకుంటున్నాయని నివేదక పేర్కొనింది. ఇందులో విశాఖపట్నం 202 పాయింట్లు, అనంతపురం 145 పాయింట్లు, హైదరాబాదు 100 పాయింట్లు, తిరుపతి 95 పాయింట్లు, ఏలూరు 61 పాయింట్లు గాలి నాణ్యతను సూచిస్తున్నట్లు నివేదికలో పేర్కొన్నారు.

దేశ రాజధాని ఢిల్లీ, పంజాబ్, హరియాణా ప్రాంతాల్లో పంట పొలాల వ్యర్ధాలను తగులబెట్టడం, వాహనాలు విడుదల చేసే కర్భనఉద్గారాల తో కాలుష్యం పెరుగుతోందని సీపీసీబీ తన నివేదికలో తెలిపింది. ఇటీవల పంజాబ్ రాష్ట్రంలో పంట వ్యర్ధాల కాల్చివేత కట్టడిలో అక్కడి ప్రభుత్వం విఫలం చెందిందని కేంద్రం పేర్కొనింది. దీన్ని నియంత్రించే పనిలో ఉన్నట్లు ప్రభుత్వం కూడా బదులచ్చింది.

ఇది కూడా చదవండి: Air India: ప్రయాణికుడికి వాష్ రూంలో ప్రవేశించేందుకు “నొ ఎంట్రీ”.. ఎయిర్ ఇండియా పైలట్ పై కేసు

Exit mobile version