Site icon Prime9

Lightning Strike : పశ్చిమ బెంగాల్‌లో పిడుగుల భీభత్సం.. ఒక్కరోజులో 14 మంది మృతి

lightning strike in west bengal state leads to 14 deaths

lightning strike in west bengal state leads to 14 deaths

Lightning Strike : పశ్చిమ బెంగాల్‌లో దారుణం చోటు చేసుకుంది. గురువారం రోజున రాష్ట్రం లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తారు వర్షాలు కురిశాయి. కానీ పిడుగులు మాత్రం భీభత్సం సృష్టించాయి. ఈ మేరకు పిడుగు పాటుకు గురై ఒక్క రోజులోనే ఏకంగా 14 మంది మృతి చెందడం కలకలం రేపుతోంది. పుర్బ బర్దమాన్ జిల్లా లోనే పిడుగు పాటుకు 4 మృతి చెందారు. అలాగే ముర్షిదాబాద్ జిల్లాలో 2..  నార్త్ 24 పర్గానాస్ జిల్లాల్లో మరో 2 ప్రాణాలు విడవగా.. పశ్చిమ్ మిడ్నాపూర్ జిల్లాలో 3, హౌరా రూరల్ జిల్లాలో మరో 3 పిడుగులు పడి చనిపోయినట్లు విపత్తు నిర్వహణ శాఖ అధికారులు తెలిపారు.

పిడుగుల వల్ల చనిపోయిన వారిలో చాలా మంది రైతులే కావడం మరింత బాధాకారం. వీళ్లందరూ తమ వ్యవసాయ క్షేత్రాల్లో పని చేస్తుండగానే ఒక్కసారిగా పిడుగు పడటంతో చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. అలాగే గురువారం సాయంత్రం మరికొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడినట్లు వివరించారు ప్రకృతి ప్రకోపానికి రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొరోజులోను ఇంతమంది చనిపోవడం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.

జిల్లాల వారీగా మృతి చెందిన వారు (Lightning Strike)..

పుర్బా బర్ధమాన్ జిల్లా – 4

ముర్షిదాబాద్ జిల్లా – 2

నార్త్ 24 జిల్లా – 2

పశ్చిమ్ మిడ్నాపూర్ జిల్లా – 3

హౌరా రూరల్ జిల్లా – 3

Exit mobile version