Site icon Prime9

Lic Investments: అదానీ ఎఫెక్ట్ తో అలెర్ట్ అయిన ఎల్ఐసీ

Lic Investments

Lic Investments

Lic Investments: అదానీ గ్రూప్‌ వ్యవహారంలో ఎల్‌ఐసీపై తీవ్ర విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎల్ఐసీ అప్రమత్తమైంది. రుణ, ఈక్విటీ పెట్టుబడులపై పరిమితి విధించాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంపై త్వరలో బోర్డు సమావేశం నిర్వహించి.. నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అమెరికాకు చెందిన రీసెర్చ్ సంస్థ హిండెన్‌బర్గ్‌ వెలువరించిన నివేదికతో అదానీ (Adani group)షేర్లు కుప్పకూలిన విషయం విషయం తెలిసిందే. దీంతో ఈ గ్రూప్‌ స్టాక్స్‌లో భారీగా పెట్టుబడులు పెట్టిన ఎల్‌ఐసీ సైతం తన పెట్టుబడుల విలువ కోల్పోయింది. దీంతో ఎల్‌ఐసీపై విపక్షాల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.

బోర్డ మీటింగ్ లో నిర్ణయం(Lic Investments)

ఈ నేపథ్యంలో సంస్థలు, గ్రూప్‌ కంపెనీలు, ఒకే ప్రమోటర్‌ కలిగిన కంపెనీలకు ఇచ్చే రుణ, ఈక్విటీ పెట్టుబడులపై పరిమితి విధించాలని ఎల్‌ఐసీ యోచిస్తోందని సమాచారం. ఆ కంపెనీ మొత్తం ఈక్విటీల్లో 10 శాతం, రుణాల్లో 10 శాతం వరకు మాత్రమే పెట్టుబడి పెట్టేందుకు ప్రస్తుతం వీలుంది. అయితే, ఈ పెట్టుబడులపైనా ఓ పరిమితి విధించుకోవాలని ఎల్‌ఐసీ అనుకుంటోంది. అయితే ఆ పెట్టుబడి ఎంత శాతం అనేది బోర్డులో నిర్ణయించే అవకాశం ఉంది. అదానీ గ్రూప్‌ కంపెనీల్లో ఎల్‌ఐసీ 30వేల కోట్లు పెట్టుబడి పెట్టింది. దాదాపు రూ. 6 వేల కోట్లు మేర రుణాలు ఇచ్చింది. పరిమితి విధించే అంశంపైన ఎల్‌ఐసీ గానీ, ఆర్థిక శాఖ నుంచి గానీ ఎలాంటి స్పందన రాలేదు.

 

Exit mobile version