Site icon Prime9

Lalu Prasad Yadav: ఆర్ఎస్ఎస్ ను నిషేధించండి.. లాలూ ప్రసాద్ యాదవ్

Lalu Prasad Yadav

Lalu Prasad Yadav

Bihar: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ)పై కేంద్రం ఐదేళ్ల పాటు నిషేధం విధించిందన్న వార్తల నేపథ్యంలో ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ ట్విట్టర్ లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) పై విరుచుకుపడ్డారు. పిఎఫ్ఐ మాదిరి ఆర్ఎస్ఎస్ తో సహా, విద్వేషాన్ని వ్యాప్తి చేసే అన్ని సంస్థలపై నిషేధం ఉండాలి. అన్నింటికంటే ముందు ఆర్ఎస్ఎస్ ని నిషేధించండి. ఇది పిఎఫ్ఐ కంటే ఘోరమైన సంస్థ. ఆర్ఎస్ఎస్ గతంలో రెండుసార్లు నిషేధించబడింది. గుర్తుంచుకోండి. ఆర్ఎస్ఎస్ ని మొదట ఉక్కు మనిషి సర్దార్ పటేల్ నిషేధించారు. “ఆర్‌ఎస్‌ఎస్ హిందూ అతివాద సంస్థ అని, దానిని నిషేధించాల్సిన అవసరం ఉందని లాలూ ట్వీట్ చేసారు.

మరోవైపు లాలూ ప్రసాద్ యాదవ్‌ కు వైద్య చికిత్స నిమిత్తం విదేశాలకు వెళ్లేందుకు ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు బుధవారం (సెప్టెంబర్ 28) అనుమతి ఇచ్చింది. అక్టోబర్ 10 నుంచి అక్టోబర్ 25 వరకు వైద్య చికిత్స కోసం సింగపూర్ వెళ్లేందుకు ఆయన కోర్టు అనుమతి కోరారు. సీబీఐ మరియు ఈడీ దాఖలు చేసిన IRCTC స్కామ్ కేసుల్లో బెయిల్‌పై బయట ఉన్నారు. 2019 జనవరిలో సీబీఐ దాఖలు చేసిన ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) కుంభకోణం కేసులో ప్రసాద్‌కు బెయిల్ మంజూరైంది. ముందస్తు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని, సాక్ష్యాలను తారుమారు చేయవద్దని ఢిల్లీ కోర్టు ఆదేశించింది.

బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌కు సమాధానం ఇచ్చేందుకు ఢిల్లీ కోర్టు మరింత సమయం ఇచ్చింది. అక్టోబరు 18 (మంగళవారం) తదుపరి విచారణకు హాజరు కావాలని కోర్టు యాదవ్‌ను కోరింది.

Exit mobile version