Site icon Prime9

Kumaraswamy: ముగిసిన పోలింగ్.. కుమార స్వామి సంచలన వ్యాఖ్యలు

Kumaraswamy

Kumaraswamy

Kumaraswamy: కర్ణాటక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈ క్రమంలో ఎన్నికల సరళిపై జేడీఎస్ నేత, మాజీ సీఎం కుమారస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో తాము బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ధన బలాన్ని తట్టుకోలేకపోయామన్నారు. నిధుల కొరత వల్ల గెలిచే 25 సీట్లలో వెనుకబడ్డామని తెలిపారు. జేడీఎస్ అభ్యర్థులకు ఆర్థికంగా తాను సాయపడలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. 120 సీట్లు గెలుస్తామని మొదట అనుకున్నామన్నారు. కానీ ఇపుడు 120 సీట్లు రాకపోయినా.. తమకే ఎక్కువ సీట్లు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కర్ణాటకలో జేడీఎస్ కింగ్ మేకర్ కాదని.. కింగ్ అవుతుందని కుమారస్వామి వ్యాఖ్యానించారు.

 

ముగిసిన పోలింగ్(Kumaraswamy)

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ముగిసినప్పటికీ.. క్యూలైన్లలో ఉన్న వారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు అధికారులు. కాగా, సాయంత్రం 5 గంటల వరకు 65.69 శాతం పోలింగ్ నమోదు అయినట్టు ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 72.13 శాతం పోలింగ్ నమోదు అయింది. ఈ సారి ఎన్నికల్లో కొత్తగా ఓటింగ్ అవకావం వచ్చిన వారితో పాటు యువకులు, వృద్ధులు, ప్రముఖులు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు వచ్చారు. రాష్ట్రంలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. ఈ నెల 13 వ తేదీ ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

 

 

ఫలితాలపై ఉత్కంఠ

ఈ ఎన్నికల్లో కన్నడ ఓటర్లు ఎవరికి పట్టం కడతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. గత కొంత కాలంగా కర్ణాటక ప్రజలు వరుసగా ఏ పార్టీకి రెండో ఛాన్స్ ఇవ్వలేదు. ఇక ఈ ఎన్నికల్లో గత సంప్రదాయం ప్రకారమే ప్రభుత్వాన్ని మారుస్తారా? లేదంటే 38 ఏళ్ల సంప్రదాయాన్ని బద్దలు కొడుతూ వరుసగా రెండో సారి ప్రస్తుత ప్రభుత్వానికి అవకాశం కల్పిస్తారా? అనేది మరో మూడు రోజుల్లో జరుగునున్న కౌంటింగ్‌తో తేలనుంది.

 

 

Exit mobile version
Skip to toolbar