Site icon Prime9

Triparna Chakraborty: బాగా నిద్రపోయి రూ.5 లక్షలు సంపాదించిన యువతి

Triparna-Chakraborty

Kolkata: సర్వసాధారణంగా కొన్ని పారిశ్రామిక కంపెనీలు బయ్ 1 గెట్ 1 అని మరికొన్ని 50 శాతం డిస్కౌంట్ అని ఇంకొన్ని ఒకటి కొంటే మరొక ప్రొడక్ట్ ఉచితం అని ఇలా అనేక రకాల ఆఫర్లను పెట్టడం మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఇటీవలె కాలంలో కొన్ని వ్యాపార సంస్థలు తమ ప్రొడక్ట్స్ అమ్మకానికిగానూ కొత్త కొత్త ఆఫర్లను వినియోగదారుల ముందు ఉంచుతున్నాయి. దానిలో భాగంగానే వేక్ ఫిట్ అనే పరుపుల కంపెనీ వారు బాగా నిద్రపోతే రూ.5లక్షల మీ సొంత అంటూ ఓ వింత ఆఫర్ను ప్రజలముందుంచింది. మరి ఆఫర్ వివరాలేంటో, ఆ డబ్బును గెలుచుకున్న విజేత ఎవరో చూసేద్దామా.

ఏ ఇంట్లో అయినా లేదా ఆఫీసులో అయినా ఎక్కువగా నిద్ర పోతే తిడుతుంటారు. అంత నిద్ర అనర్ధం అని పెద్దవాళ్లు చివాట్లు పెట్టడమూ చూశాము. కానీ ఓ అమ్మాయి బాగా నిద్రపోయి రూ.5 లక్షలు సంపాదించిందంటే నమ్మగలమా, నిజమండీ. కలకత్తాకు చెందిన త్రిపర్ణ చక్రవర్తి (26)కి నిద్రపోవడం అంటే అమితమైన ఇష్టం. దానికి తగినట్టుగానే వేక్ ఫిట్ పరుపుల కంపెనీవారు ఇచ్చిన ఆఫర్ను చూసింది. అనుకున్నదే తడవుగా ఆ కంపెనీ నిర్వహిస్తున్న ఇంటర్న్ షిప్ ప్రోగ్రాంలో పాల్గొని తనకిష్టమైన పనిచేసి లక్షాధికారిణి అయ్యింది.

వేక్ ఫిట్.కో కంపెనీ వారు గత మూడేళ్లుగా స్లీప్ ఇంటర్న్‌షిప్ కార్యక్రమాలను చేపడుతుంది. అయితే తాజాగా స్లీప్ ఇంటర్న్‌షిప్ సీజన్-2ను నిర్వహించింది. దానిలో దేశవ్యాప్తంగా పలువురు ఉత్సాహవంతులు పాల్గొన్నారు. కాగా కోల్‌కతాకు చెందిన త్రిపర్ణ చక్రవర్తి (26) కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మంచిగా నిద్రపోయి ఫైనల్స్ కు ఎంపికయ్యింది. ఫైనల్స్ కు ఎంపికైన నలుగురు వ్యక్తుల నిద్ర ఏ స్థాయిలో ఉందో అని కొందరు వ్యక్తులు వారిని పర్యవేక్షించారు. దీనిని నిద్రపోయే వ్యవధి, మేల్కొని ఉన్న సమయం, తేలికపాటి నిద్ర, గాఢ నిద్ర వంటి వాటిని పరిగణలోకి తీసుకుని గాఢనిద్ర సామర్థ్యాన్ని లెక్కగడతారు. అయితే చివరకు ఈ పోటీలో త్రిపర్ణ చక్రవర్తి విజయం సాధించారు. అత్యంత మంచి నిద్ర పోయే వ్యక్తిగా త్రిపర్ణ రూ.5 లక్షలు గెలుపొందారు. చూశారా తమకిష్టమైన పనులు చేస్తూ కూడా డబ్బులు సంపాధించవచ్చు అనడానికి ఈ అమ్మాయే ఓ మంచి ఉదాహరణ.

Exit mobile version