Site icon Prime9

Kolkata: భారతదేశంలో అత్యంత సురక్షితమైన నగరంగా కోల్‌కతా

Kolkata

Kolkata

Kolkata: భారతదేశంలో అత్యంత సురక్షితమైన నగరంగా కోల్‌కతా వరుసగా మూడవ సంవత్సరం అవతరించింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) ప్రచురించిన నివేదిక ప్రకారం ప్రతి లక్ష జనాభాకు అతి తక్కువ నేరాలు ఇక్కడ నమోదయ్యాయి.

కోల్‌కతాలో2022లో ప్రతి లక్ష మందికి 86.5 కాగ్నిజబుల్ నేరాల కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత పూణే (280.7), హైదరాబాద్ (299.2) ఉన్నాయని ఎన్‌సిఆర్‌బి డేటా పేర్కొంది.భారత శిక్షాస్మృతి (IPC) మరియు SLL (ప్రత్యేక మరియు స్థానిక చట్టాలు) సెక్షన్ల కింద నమోదైన కేసులను కాగ్నిజబుల్ నేరాలు అంటారు.ఎన్‌సిఆర్‌బి నివేదిక ప్రకారం, కోల్‌కతాలో 2021లో లక్ష మందికి 103.4 కాగ్నిజబుల్ నేరాల కేసులు నమోదయ్యాయి, ఈ ఏడాది అది 86.5కి తగ్గిపోయాయి. 2020లో ఈ సంఖ్య 129.5గా ఉంది. మరోవైపు 2021లో, పూణే మరియు హైదరాబాద్‌లలో లక్ష జనాభాకు వరుసగా 256.8 మరియు 259.9 నేరాలు నమోదయ్యాయి.20 లక్షలకు పైగా జనాభా ఉన్న 19 నగరాలను పోల్చిచూసి ఈ ర్యాంకింగ్స్‌ను విడుదల చేశారు.

మహిళలపై నేరాలు పెరిగాయి..(Kolkata)

అయితే కోల్‌కతాలో మహిళలపై నేరాలు పెరిగాయని, 2021లో కేసుల సంఖ్య 1,783 నుంచి 2022 నాటికి 1,890కి పెరిగిందని నివేదిక పేర్కొంది.కోల్‌కతాలో మహిళలపై నేరాల రేటు లక్ష జనాభాకు 27.1గా ఉంది. ఈ సంఖ్య కోయంబత్తూర్‌లో 12.9 మరియు చెన్నైలో 17.1గా ఉండటం గమనార్హం. కోల్‌కతాలో 2022లో 11 అత్యాచారాలు నమోదయ్యాయి, 2021లో కూడా అదే సంఖ్య నమోదైంది.కోల్‌కతా నగరంలో హింసాత్మక నేరాలు కూడా తగ్గాయి. కేవలం 34 హత్య కేసులు మాత్రమే నమోదయ్యాయి. గత సంవత్సరం 45 కేసులు నమోదయ్యాయి.

Exit mobile version