Kerala Dog: కేరళలోని ఒక పెంపుడు కుక్క కన్నూర్ జిల్లా ఆసుపత్రిలోని మార్చురీ ముందు తన యజమాని కోసం వేచి ఉంది. అక్కడ గత నాలుగు నెలలు కిందట మరణించిన తన యజమాని తిరిగి వస్తాడని భావిస్తూ అక్కడే తిరుగుతోంది. ఆసుపత్రి ఉద్యగులు అక్కడికి వచ్చేవారు కుక్క కు తన యజమాని పట్ల ఉన్న ప్రేమకు విస్తుపోతున్నారు.
మార్చురీలోకి తీసుకువెళ్లడం చూసి ..(Kerala Dog)
ఆసుపత్రి సిబ్బంది అది రోగితో వచ్చిందని చెప్పారు.నాలుగు నెలల క్రితం ఒక రోగి ఆసుపత్రికి వచ్చాడు, రోగితో పాటు కుక్క కూడా వచ్చింది, రోగి చనిపోయాక అతడిని మార్చురీకి తీసుకువెళుతుండగా కుక్క చూసింది. యజమాని ఇంకా ఇక్కడే ఉన్నాడని కుక్క భావిస్తోంది. కుక్క ఈ ప్రదేశాన్ని వదిలి వెళ్ళడం లేదు. గత నాలుగు నెలలుగా ఇక్కడ ఉంది. కుక్క రోగిని మార్చురీకి తీసుకెళ్తున్నప్పుడు ముందు తలుపు ద్వారా చూసింది. కుక్క కు తెలియని విషయం ఏమిటంటే, మృతదేహాలన్నీ మరొక తలుపు ద్వారా బయటకు తీసారు. అయితే తీసుకువెళ్లిన తలుపు ద్వారా తన యజమాని వస్తాడని ఆశతో ఎదురుచూస్తోందని = ఆసుపత్రి సిబ్బంది చెప్పారు.
ఈ కుక్కకు ‘రాము’ అని పేరు పెట్టినట్లు ఆసుపత్రిలోని సిబ్బంది తెలిపారు.అతను ఇతర తోటి కుక్కలతో కలసి ఉండడు, ఆకలితో ఉన్నప్పుడు సీన్ క్రియేట్ చేయడు. అతను ఆసుపత్రిలోని సిబ్బంది అందరికీ స్నేహితుడు. రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ఆసుపత్రికి వచ్చినప్పుడు కూడా, రాము తన యజమాని కోసం వేచి ఉన్నాడు. మేము కుక్కకు ఆహారం పెడుతుంటామని చెప్పారు. కుటుంబ బంధాలు కూడా తెగిపోతున్న తరుణంలో ఓ పెంపుడు కుక్క తన యజమాని కోసం మార్చురీ ముందు ఎదురుచూస్తోంది. కుక్కలు తమ యజమానులకు విధేయత మరియు విశ్వసనీయతకు ప్రసిద్ధి చెందాయి.