Site icon Prime9

Bride Lorry Drive: లారీ నడిపిన పెళ్లికూతురు.. పక్కనే కూర్చున్న భర్త

Bride lorry drive

Bride lorry drive

Bride Lorry Drive: కేరళలో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఓ పెళ్లి కూతురు కాబోయే భర్తను లారీ ఎక్కించుకుని షికారు చేసిన వీడియో ప్రస్తుతం సోషన్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఇదేం ప్రేమ కథ అంటూ ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుత కాలంలో పెళ్లి వేదిక వద్దకు వధూవరులు వినూత్న రీతిలో చేరుకుంటున్నారు. కానీ కేరళలోని త్రిస్సూర్ కు చెందిన ఓ వధువు మాత్రం వినూత్న రీతిలో పెళ్లి వేడుక వద్దకు చేరుకుంది.

డ్రైవింగ్ అంటే ఇష్టంతోనే!

కేరళకు వధువు దలీషా కాస్త భిన్నంగా ఆలోచించి పెళ్లి వేడుకలో తన ముచ్చట తీర్చుకుంది. వృత్తిపరంగా ఆయిల్‌ ట్యాంకర్‌ నడిపే ఆమె.. అదే లారీలో కాబోయే భర్తను ఎక్కించుకొని రోడ్లపై షికారు చేసింది. ఓవైపు తన వృత్తి పట్ల తన ఇష్టాన్ని ప్రదర్శిస్తూనే మరోవైపు వినూత్నంగా పెళ్లి వేదిక వద్దకు చేరుకుంది.

వీరి ప్రేమ ఎలా పుట్టిందంటే?

వీరిద్దరి ప్రేమ కూడా లారీలో పట్టిందట.. అవును మీరు విన్నది నిజమే. పెద్దలను సైతం ఒప్పించి పెళ్లి పీటలెక్కారు దలీషా, హన్సన్. గల్ఫ్ కంట్రిలో ఆయిల్ ట్యాంకర్‌ లారీ డ్రైవర్‌గా పనిచేస్తోంది దలీషా. హన్సన్‌ కూడా అక్కడే పని చేస్తుండేవాడు. ఈ పరిచయమే వారి ప్రేమకు పునాదిగా మారింది. ఇక వారి ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పి మరి పెద్దలను ఒప్పించారు.

 

రెండు కుటుంబాలు పెళ్లికి ఓకే అనడంతో ఇలా పెళ్లి వేడుకను చేసుకున్నారు. రెండు కుటుంబాలు ఇచ్చిన ధైర్యంతో వారు వినూత్నంగా ఇలా వివాహం జరుపుకున్నారు. తమ ప్రేమకు కారణమైన డ్రైవింగ్ వల్లే ఇదంతా జరిగిందని.. దానికి కారణం లారీ అని వారు నమ్మారు. దీంతో ఆయిల్‌ ట్యాంకర్‌ పై కాసేపు తిరుగుతూ సందడి చేశారు. మెుదట్లో కొందరు వధువు లారీ నడపడమేంటని ప్రశ్నించిన.. వృత్తి అదేనని తెలిశాక ప్రశంసించారు. నాన్న ఇచ్చిన ధైర్యంతోనే తను ఆయిల్‌ ట్యాంకర్‌ డ్రైవర్‌ అయ్యానని దలీషా చెప్పుకొచ్చింది. వాళ్ల నాన్న కూడా అదే పనిలో ఉండటం వల్లే డ్రైవింగ్ నేర్చుకున్నట్లు వధువు తెలిపింది. ఇష్టమైన వృత్తిలో పనిచేసే వ్యక్తినే ప్రేమించి పెళ్లి చేసుకోవడం సంతోషంగా ఉందని పెళ్లి కూతురు తెలిపింది.

చిరంజీవి బ్లడ్ బ్యాంక్ బాధ్యతలు తీసుకున్న చిరు సిస్టర్ డాక్టర్ మాధవీరాజ్ | Chiru Sister MadhaviRaj

ఇవి కూడా చదవండి:

CCTV: హైదరాబాద్‌లో పిల్లిని ఎత్తుకుపోతున్న దొంగ.. CCTV ఫుటేజ్ వైరల్

Khammam Politics: ఖమ్మంలో ఊహించని ట్విస్ట్‌లు.. ఫిక్స్ అయిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. పోతే పోనియండన్న కేసీఆర్

Constable Leave Letter: సార్ నా భార్య అలిగింది.. బుజ్జగించడానికి లీవ్ ఇవ్వండి

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: http://Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version
Skip to toolbar