Site icon Prime9

Jammu Kashmir: కాశ్మీరీ పండిట్ ను కాల్చి చంపిన ఉగ్రవాదులు

Kashmir

Kashmir

Shopian district: శనివారం జమ్మూ కాశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో పండ్ల తోటలకు వెళుతున్న పూరన్ క్రిషన్‌ అనే కాశ్మీరీ పండిట్‌ను ఉగ్రవాదులు కాల్చిచంపినట్లు అధికారులు తెలిపారు. KFF (కశ్మీర్ ఫ్రీడమ్ ఫైటర్స్) సంస్ద దీనికి బాధ్యత వహించింది.

దక్షిణ కాశ్మీర్ జిల్లాలోని చౌదరి గుండ్ ప్రాంతంలోని అతని నివాసం సమీపంలో ఈ దాడి జరిగింది, షోపియాన్ ఆసుపత్రికి తరలించిన తర్వాత క్రిషన్ చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారని వారు తెలిపారు. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు దుండగులను పట్టుకోవడానికి వేట ప్రారంభించినట్లు తెలుస్తోంది. ప్రాథమిక విచారణలో క్రిషన్ ను టార్గెట్ చేసినపుడు అతడి ఎదుటే ఒక్కరే ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారని పోలీసులు తెలిపారు.

ఈ ఘటనపై డీఐజీ సుజిత్ కుమార్ మాట్లాడుతూ, “కాశ్మీరీ పండిట్ పురాణ్ జీ హత్యకు గురయ్యాడు. మేము దానిపై (కేసు) పని చేస్తున్నాము. దాని గురించి మేము ఇంకా ఖచ్చితంగా ఏమీ చెప్పలేము, ఇక్కడ ఒక గార్డు ఉన్నాడు” మేము కారణాన్ని నిర్ధారిస్తున్నాము. దీనికి కొంత సమయం పడుతుందని అన్నారు.

Exit mobile version