Minister Sudhakar: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తలపెట్టిన భారత్ జోడో యాత్ర కర్ణాటకలో జోరుగా సాగుతుంది. ఓ వైపు ప్రజలు జోడోయాత్రకు బ్రహ్మరధం పడుతున్నారు. రాహుల్ కూడా ఉత్సాహంగా ముందుకు సాగుతూ, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రత్యేక దృష్టి సారించారు.
కొద్ది నెలల్లో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కూడా రాహుల్ గాంధీకి జత కలసి ఓ రోజు పాదయాత్ర కొన్ని కి.మీ మేర పాల్గొన్నారు. దీంతో కర్ణాటక భాజపా అప్రమత్తమైంది. కాంగ్రెస్ నుండి భాజపాలోకి జంప్ చేసిన ప్రస్తుత వైద్య, విద్యా శాఖ మంత్రి సుధాకర్ కాంగ్రెస్ ను టార్గెట్ చేశారు.
కాంగ్రెస్ గ్రాండ్ ఓల్డ్ పార్టీ అంటూ పేర్కొన్నారు. జోడో యాత్రను ‘దిక్కులేనిది’ అని ఆయన అభివర్ణించారు. ఆర్‌ఎస్‌ఎస్ దాని సిద్ధాంతాలపై దాడి చేయడమే లక్ష్యంగా ఉందని ఆయన ట్విట్టర్ ద్వారా కాంగ్రెస్ పై ధ్వజమెత్తారు. అంతగాకుండా తన పూర్వీకుల విధానాన్ని రాహుల్ అనుసరిస్తున్నాడంటూ, విభజించి పాలించు అనే ఏకైక విధానంతో ఐదు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ భారతదేశాన్ని పాలించింది నిజం కాదా అంటూ సందించారు. కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులను సరిద్దిదడానికే ఆర్ఎస్ఎస్, భాజపాలు జాతీయ సమైక్యత మార్గంలో పనిచేస్తున్నాయని కితాబులిచ్చుకొన్నారు.
మరోవైపు కర్ణాటకలో భారత్ జోడో యాత్ర ప్రభావం ఉండకుండా చూసేందుకు కాంగ్రెస్ కీలక నేతలు శివకుమార్ అండ్ టీంకు ఈడీ సమన్లు జారీచేసింది. కొద్ది రోజులు గడువు కావాలని కోరిన్నప్పటికీ ఈడీ నిరాకరించడంతో నేడు వారు ఈడీ ఎదుట హాజరయ్యేందుకు ఢిల్లీకి వెళ్లారు.
ఇది కూడా చదవండి: Sonia Gandhi: జోడోయాత్రలో రాహుల్ తో కలిసి నడిచిన సోనియాగాంధీ