Site icon Prime9

Minister Umesh Katti: గుండెపోటుతో మరణించిన కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఉమేష్ కత్తి

Minister-Umesh-Katti

Karnataka: కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఉమేష్‌ కత్తి మంగళవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. ఉమేష్ బెంగళూరు డాలర్స్ కాలనీలోని తన నివాసంలోని టాయిలెట్‌లో కుప్పకూలిపోయాడు. ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు లోనికి వెళ్లి నేలపై పడి ఉన్న అతడిని చూసి ఎంఎస్ రామయ్య ఆస్పత్రికి తరలించారు.

ఐసీయూలో ఉంచిన ఆయన తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు భార్య షీలా, కుమారుడు నిఖిల్, కుమార్తె స్నేహ ఉన్నారు. 1961లో జన్మించిన ఉమేష్ బెలగావి జిల్లాలోని హుక్కేరి నుంచి ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

Exit mobile version