Karnataka Temples: కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 35 వేల ఆలయాల్లో మొబైల్ ఫోన్ల వినియోగాన్ని నిషేధిస్తూ కర్ణాటక ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని గురించి భక్తులకు తెలియజేసే సైన్ బోర్డులను ప్రదర్శించాలని ఆలయాలను నిర్దేశించింది.
ఇటీవల కాలంలో మొబైల్ ఫోన్ల వినియోగం బాగా పెరిగిపోయిందని, దీంతో ఆలయ సిబ్బంది, ఇతర భక్తులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొంది. అందువల్ల, ఆలయ ప్రాంగణం లోపల ఉన్నప్పుడు ప్రజలు తమ మొబైల్ ఫోన్‌లను స్విచ్ ఆఫ్ చేయాలని సూచించింది.ముజ్రాయి శాఖ అదనపు కార్యదర్శి సంతకం చేసిన ఉత్తర్వుల ప్రకారం ఆలయ నిర్వాహకులందరూ ఆలయ ప్రాంగణంలోని సైన్‌బోర్డ్‌లపై సందేశాన్ని ప్రదర్శించడానికి ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది.అయితే, ఈ నిబంధనను అమలు చేయడం మరియు ఆర్డర్‌ను పాటించని వారిపై తీసుకోగల చర్యలపై స్పష్టత ఇవ్వలేదు.