Karnataka Exit Polls: కన్నడనాట గెలుపెవరిది..? ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలివే..!

Karnataka Exit Polls: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ ఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావించాయి. ఎన్నిక ముగిసిన తర్వాత.. ఎగ్జిట్‌ పోల్‌ సర్వేలు ఆయా పార్టీల విజయావకాశాలను అంచనా వేశాయి.

Karnataka Exit Polls: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ ఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావించాయి. ఎన్నిక ముగిసిన తర్వాత.. ఎగ్జిట్‌ పోల్‌ సర్వేలు ఆయా పార్టీల విజయావకాశాలను అంచనా వేశాయి. మరి ఈసారి ఏ పార్టీ కూడా సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయనుందా అనేది ఓసారి చూద్దాం.

ఎగ్జిట్ పోల్స్ ఇవే.. (Karnataka Exit Polls)

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ ఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావించాయి. ఎన్నిక ముగిసిన తర్వాత.. ఎగ్జిట్‌ పోల్‌ సర్వేలు ఆయా పార్టీల విజయావకాశాలను అంచనా వేశాయి. మరి ఈసారి ఏ పార్టీ కూడా సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయనుందా అనేది ఓసారి చూద్దాం.

సార్వత్రిక ఎన్నికలకు కొన్ని నెలల ముందు కర్ణాటకలో రసవత్తర పోరుసాగింది. ఈ ఎన్నికల్లో గెలుపును.. ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మరి ఈసారి కన్నడ ప్రజలు ఎవరికి జై కొట్టారనే విషయంపై ఎగ్జిట్ పోల్స్ ఏమంటున్నాయో ఓ లుక్కేద్దాం.

BJP CONG JDS OTH

పీపుల్స్ పల్స్ 70-90 107-119 23-29 1-3
రిపబ్లిక్ 85-100 94-108 24-32 2-6
సీ ఓటర్ 83-95 100-112 21-29 2-6
శ్రీ ఆత్మసాక్షి 83-94 117-124 23-30 2-8
జీ న్యూస్ 79-94 103-118 25-33 2-5
జన్‌కీ బాత్ 94-117 91-106 14-24 0-2
న్యూస్ నేషన్ 114 86 21 3
ఈటీజీ 78-92 106-120 20-26 2-4
పోల్‌స్ట్రాల్ 88-98 99-109 21-26 0-4
ఏబీపీ సర్వే 83-95 100-112 21-29 2-6

 

మళ్లీ హంగ్‌ తప్పదా..?

కర్ణాటక అసెంబ్లీలో మెుత్తం 224 స్థానాలున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచన వేశాయి. కానీ ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 113 సీట్లు వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. దీంతో మరోసారి హంగ్ ఏర్పడవచ్చని తెలుస్తోంది. ఇక జేడీఎస్ కు 20 నుంచి 30 సీట్లు వచ్చే అవకాశం ఉండటంతో.. కుమారస్వామి పార్టీ కింగ్ మేకర్ గా మారనుంది.

టీవీ9 భారత్‌ వర్ష్, పీపుల్స్ పల్స్, రిపబ్లిక్ టీవీ, ఏబీపీ సీ-ఓటర్ సంస్థల ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ సీట్లు వస్తాయని తెలిపింది.

బీజేపీ ఎక్కువ స్థానాలు గెలుస్తుందని న్యూస్ నేషన్ సీజీఎస్ ప్రకటించింది.

ఈ అయిదు సర్వేల ఉమ్మడి ఫలితాల ప్రకారమైతే కాంగ్రెస్ పార్టీకి కనీసం 86 స్థానాల నుంచి గరిష్ఠంగా 119 స్థానాలు వచ్చే అవకాశం ఉంది.

బీజేపీకి కనిష్ఠంగా 78 స్థానాలు వస్తాయని పీపుల్స్ పల్స్ సర్వే చెప్పింది. బీజేపీకి గరిష్ఠంగా 114 స్థానాలు గెలవచ్చని న్యూస్ నేషన్ సీజీఎస్ వెల్లడించింది.

జేడీఎస్‌ గరిష్ఠంగా 32 స్థానాలు గెలవొచ్చని రిపబ్లిక్ టీవీ చెప్పింది.

ఇతరుల ఖాతాలో గరిష్ఠంగా 6 సీట్లు చేరే అవకాశం ఉన్నట్లు ఈ పోల్స్ తెలుపుతున్నాయి.

2018లో ఇలా..

2018 ఎన్నికల్లో మెుదట యడియురప్పా సీఎం గా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ మూడు రోజులకే ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది.

ఆ తర్వాత.. కాంగ్రెస్‌, జేడీఎస్‌ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. హెచ్‌డీ కుమారస్వామి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు.

కొన్ని కారణాల వల్ల.. కుమారస్వామి కేవలం 14 నెలలపాటు మాత్రమే సీఎంగా కొనసాగారు.

ఆ తర్వాత కొందరు ఎమ్మెల్యేలు భాజపాలో చేరడంతో.. స్వంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.