Kannada Hero Darshan: కన్నడ నటుడు దర్శన్ తూగుదీప హత్య కేసులో ప్రస్తుతం కటకటాల పాలయ్యాడు. పవిత్ర గౌడ అనే యువతిలో అక్రమ సంబంధమే హత్యకు దారితీసింది. ప్రస్తుతం శాండిల్‌వుడ్‌లో ఈ కేసు సంచలనం రేపుతోంది. ఇంతకు కన్నడ హీరో దర్శన్ తన అభిమానిని చిత్ర హింసలు పెట్టి చంపడానికి గల కారణాలేమిటి? పవిత్ర గౌడ ఎవరూ అనే విషయంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. హత్య కేసుకు సంబంధించి మొత్తం పదిమందిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దర్శన్‌ను ఆరు రోజుల పోలీసు కస్టడీకి తరలించారు.
ఇక హత్యకు దారితీసిన పరిస్థితుల విషయానికి వస్తే పవిత్ర గౌడ చాలెంజింగ్ స్టార్ దర్శన్‌తో దిగిన ఫోటోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో మొదలైంది. గత ఏడాది చివరి వరకు దర్శన్ జీవితం సాఫీగా సాగిపోయింది. ఈ ఏడాది జనవరి 24న పవిత్ర దర్శన్‌తో దిగిన ఫోటోలను పోస్ట్ చేయడంతో దుమారం మొదలైంది. కాగా వివాహం జరిగి పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఫోటోలను పోస్ట చేస్తున్నట్లు కింద క్యాప్షన్ రాశారు పవిత్ర. దర్శన్‌తో పాటు తన కూతురు ఫోటో కూడా పోస్ట్ చేశారు. కాగా మొదటి భర్తతో ఆమెకు ఓ పాప కూడా పుట్టింది. తర్వాత పవిత్ర భర్తను వదిలేసింది. భర్తను వదిలేసిన తర్వాత నుంచి దర్శన్‌తో చనువుగా మెలగసాగింది.
ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో వీరి గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండగా.. దర్శన్ భార్య పవిత్ర గౌడకు తన భర్తతో ఉన్న సంబంధం ఏమిటని నిలదీసింది. పవిత్ర.. ఆమె మాజీ భర్త ఫోటోలను ఇన్‌స్టాలో అప్‌లోడ్ చేశారు దర్శన్ భార్య. వారి ఏజెండా ఏమిటని నిలదీశారు. దీంతో దర్శన్ ఫ్యాన్స్ పవిత్రపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్ట్‌లు కూడా పెట్టారు. దర్శన్ అభిమానుల్లో రేణుకా స్వామి ఒకరు. ఆయన చిత్ర దుర్గలో అపోలో ఫార్మసీలో పనిచేసేవాడు. తన అభిమాన హీరో కుటుంబాన్ని సర్వనాశనం చేస్తున్నావంటూ..పవిత్రపై కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలను రేణుకా స్వామి చేస్తూ పోస్ట్ చేశాడు. ఇది పవిత్రకు ఆగ్రహం తెప్పింది. రేణుకా స్వామికి గుణపాఠం చెప్పాలని నిర్ణయించింది.
ఈ విషయం దర్శన్‌కు పవిత్ర చెప్పడం.. రేణాకా స్వామిని దర్శన్ గ్యాంగ్ కిడ్నాప్ చేసి తీసుకువెళ్లి చిత్ర హింసలు పెట్టి చంపేసింది. ప్రస్తుతం దర్శన్, పవిత్రతో పాటు పది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక పవిత్ర సోషల్ మీడియా పేజ్‌ను బట్టి చూస్తే.. ఆమె ఫ్యాషన్ డిజైనర్‌గాను బెంగళూరులోని ఓ బొతిక్‌కు మేనేజింగ్ డైరెక్టర్‌గా చెప్పుకుంటున్నారు. వాస్తవానికి ఆమె సినీరంగంలో ప్రవేశించాలనుకుంది. కానీ ఆమెకు అదృష్టం కలిసిరాలేదు. కేవలం నాలుగు సినిమాల్లో నటించిన తర్వాత వ్యాపారవేత్తగా అవతారమెత్తారు. ప్రస్తుతం హత్య కేసులో ఇరుక్కొని జైలు పాలుకావాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో.. పిటి!!!