Site icon Prime9

JP Nadda: ‘యాంటీ ఇండియా టూల్ కిట్’ లో రాహుల్ భాగమమ్యాడు

JP Nadda

JP Nadda

JP Nadda: కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీపై భారతీయన జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. భారత దేశ వ్యతిరేక శక్తుల్లో రాహుల్ గాంధీ కూడా

ఒకరంటూ విమర్శించారు. రాహుల్‘ యాంటీ ఇండియా టూల్ కిట్’లో శాశ్వత భాగమయ్యాడని తీవ్రంగా ఆరోపించారు.

 

దేశాన్ని రాహుల్ అవమానిస్తున్నారు(JP Nadda)

‘కాంగ్రెస్ పార్టీ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడం దురదృష్టకరం. దేశం పదే పదే తిరస్కరించిన తర్వాత, రాహుల్ గాంధీ ఇప్పుడు ఈ జాతీయ వ్యతిరేక టూల్‌కిట్‌లో శాశ్వత భాగమయ్యారు’ అని నడ్డా చెప్పారు.

భారత్ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకునే విదేశీ శక్తులతో రాహుల్‌ చేతులు కలుపుతున్నారని మండి పడ్డారు. అంతే కాకుండా బ్రిటన్ లోని తన ప్రసంగంలో విదేశాలు భారత్‌ అంతర్గత విషయాల్లో కలగజేసుకోవాలని డిమాండ్ చేశారని అన్నారు.

కోట్లాది మంది ప్రజలు ఎన్నుకున్న ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని రాహుల్ అవమాన పరుస్తున్నారని నడ్డా ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

రాహుల్ వ్యాఖ్యలు సిగ్గుచేటు(JP Nadda)

ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించబోతోంది. దేశంలో జీ20 సమావేశాలు జరుగుతున్న తరుణంలో రాహుల్ గాంధీ..

విదేశీ గడ్డపై దేశాన్ని, పార్లమెంటును అవమానిస్తున్నారని ఆయన అన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని రాహుల్ అవమానపరుస్తున్నారు.

తద్వారా 130 కోట్ట మంది ప్రజల తీర్పును ఆయన శంకిస్తున్నారు. ఇది దేశ ద్రోహులను బలపర్చడం కాకపోతే ఇంకేంటీ అని నడ్డా ప్రశ్నించారు.

విదేశీ గడ్డపై భారత్ ప్రజాస్వామ్యం అంతమైందంటూ రాహుల్ వ్యాఖ్యానించడం సిగ్గు చేటు అన్నారు.

అదేవిధంగా మన దేశ అంతర్గత వ్యవహారాల్లో అమెరికా, ఐరోపా దేశాలను జోక్యం చేసుకోవాలని కోరడం ఏంటని ప్రశ్నించారు.

ఒక దేశ అంతర్గత వ్యహహారాల్లో విదేశీ జోక్యాన్ని కోరడం అంటే.. దేశ సార్వభౌమత్వంపై దాడి చేయడమేనని వ్యాఖ్యానించారు

. దేశ చరిత్రలో ఎంతటి క్లిష్ట సమయంలోనూ విదేశీ జోక్యాన్ని ఇప్పటి వరకు ఏ నాయకుడు కోరలేదన్నారు.

ఈ వ్యవహారంలో రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు.

 

బీజేపీ విమర్శలకు రాహుల్ కౌంటర్

బ్రిటన్ పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ భారత్‌పై, మోదీ సర్కార్‌పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.

విదేశాల్లో భారత్‌ను రాహుల్ కించపరిచారని బీజేపీ తీవ్రంగా మండి పడుతోంది.

ఇటీవలే బ్రిటన్ పర్యటన ముగించి వచ్చిన రాహుల్ గాంధీ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. తనపై బీజేపీ చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చారు.

మోదీ హయాంలో నిజంగా ప్రజాస్వామ్యమనేదే ఉంటే…కచ్చితంగా తనకు పార్లమెంట్‌లో మాట్లాడే అవకాశం వచ్చి ఉండేదని సెటైర్లు వేశారు.

ఇదే సమయంలో గౌతమ్ అదాని, ప్రధాని మధ్య రిలేషన్ ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. తాను పార్లమెంట్‌లోకి వచ్చిన వెంటనే సభను వాయిదా వేస్తారని విమర్శించారు.

 

Exit mobile version
Skip to toolbar