Supreme Court Coliseum: సుప్రీంకోర్టు కొలిజియంలో ప్రభుత్వ ప్రతినిధులను చేర్చుకోండి.. కేంద్రమంత్రి కిరణ్ రిజిజు

న్యాయమూర్తుల ఎంపిక ప్రక్రియలో హైకోర్టు, సుప్రీంకోర్టు కొలీజియంల్లో ప్రభుత్వ ప్రతినిధులను చేర్చుకోవాలంటూ కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు.. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై చంద్రచూడ్‌ కు లేఖ రాశారు.

  • Written By:
  • Updated On - January 16, 2023 / 08:01 PM IST

Supreme Court Coliseum : న్యాయమూర్తుల ఎంపిక ప్రక్రియలో హైకోర్టు, సుప్రీంకోర్టు కొలీజియంల్లో ప్రభుత్వ ప్రతినిధులను చేర్చుకోవాలంటూ

కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు.. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై చంద్రచూడ్‌ కు లేఖ రాశారు.

న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించిన రాజ్యాంగ ప్రక్రియలో ప్రభుత్వ ప్రతినిధులకు చోటు కల్పించాలని రిజిజు ఈ సందర్భంగా సూచించారు.

జడ్జీల నియామకాల్లో పారదర్శకత, జవాబుదారీతనం గురించి ప్రజలకు తెలియజేయడం అవసరమని ఆయన లేఖలో పేర్కొన్నట్లు విశ్వసనీయ వర్గాలు ద్వారా తెలిసింది.

ప్రస్తుతం దేశంలో న్యాయమూర్తులను నియమిస్తున్న కొలీజియం వ్యవస్థ రాజ్యాంగానికి అతీతమన్నట్లు ఇటీవల కిరణ్‌ రిజిజు చేసిన వ్యాఖ్యలతో

కేంద్రం, సుప్రీంకోర్టు మధ్య అభిప్రాయభేదాలు మొదలయ్యాయి. న్యాయస్థానాల్లో కొండల్లా పేరుకుపోయిన కేసులకు కొలీజియం వ్యవస్థే కారణమన్నట్లుగా కేంద్రమంత్రి వ్యాఖ్యానించారు.

ఈ క్రమంలోనే ఇటీవల ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ మాట్లాడుతూ..

2014లో తెచ్చిన జాతీయ న్యాయ నియామకాల కమిషన్‌ ని కొట్టేయడం ద్వారా ప్రజలెన్నుకున్న పార్లమెంటు సార్వభౌమత్వాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చిందని విమర్శించడం

ఈ వివాదాన్ని మరింత తీవ్రం చేసింది. అయితే ఈ విమర్శలకు సుప్రీంకోర్టు కూడా దీటుగా బదులిచ్చింది.

కొలీజియం నచ్చకపోతే ఇంకో వ్యవస్థను తీసుకురావాలని కేంద్రంపై అసహనం వ్యక్తం చేసింది.

సుప్రీం ఆగ్రహం..

న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించి కొలీజియం పునరుద్ఘాటించిన పేర్లను కేంద్రం వెనక్కి పంపడంపై

సుప్రీంకోర్టు ఇటీవల తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అభ్యంతరం వ్యక్తం చేయడానికి ఎలాంటి కారణాలు లేకున్నా సిఫార్సులను అడ్డుకోవడం సరికాదని పేర్కొంది.

కొలీజియం కంటే మెరుగైన వ్యవస్థను తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తే, ఎవరూ నిరోధించరని, కానీ ఆ సమయం వరకు

అమల్లో ఉన్న చట్టాన్ని కచ్చితంగా అమలుపరచాల్సిందేనని స్పష్టంచేసింది.

ఈ నేపథ్యంలో కొలీజియం((Supreme Court Coliseum)లో ప్రభుత్వ ప్రతినిధులకు చోటు కల్పించాలంటూ కిరణ్‌ రిజిజు.. సీజేఐకి లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

2018 నుంచి 2022 డిసెంబర్ 19 వరకు వివిధ హైకోర్టులకు మొత్తం 537 మంది న్యాయమూర్తులను నియమించినట్లు న్యాయ మంత్రిత్వ శాఖ తెలిపింది.

వీరిలో 79 శాతం మంది అగ్రవర్ణాలు, 11 శాతం ఓబీసీలు, 2.8 శాతం ఎస్సీలు, 2.6 శాతం మంది మైనార్టీలు,

1.3 శాతం మంది ఎస్టీ వ‌ర్గాల‌కు చెందిన‌ న్యాయమూర్తులు ఉన్నారు.

20 మంది న్యాయమూర్తుల కులాలను నిర్ధారించలేమని న్యాయ మంత్రిత్వ శాఖ పార్లమెంటరీ ప్యానెల్ కు తెలిపింది.

ఐదేళ్లలో 537 నియామకాలు జరగ్గా అందులో 271 నియామకాలు బార్ కోటా నుంచి, జరిగాయి.

266 నియామకాలు సర్వీస్ కోటా ద్వారా జరిగాయి.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/