Site icon Prime9

Jharkhand Atrocity: జార్ఖండ్ లో దారుణం.. నాలుగు రోజుల పసికందును తొక్కి చంపిన పోలీసు కానిస్టేబుల్

Jharkhand

Jharkhand

Jharkhand Atrocity: జార్ఖండ్ లోని గిరిదిహ్ జిల్లాలో జరిగిన దాడిలో పోలీసు కానిస్టేబుల్ బూట్లతో తొక్కడం వల్ల నవజాత శిశువు మరణించింది. ఈవిషయం వెలుగులోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ దర్యాప్తునకు ఆదేశించారు.

ఒక కేసుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేయడానికి పోలీసు సిబ్బంది డియోరీ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోశోడింఘి గ్రామానికి వెళ్ళినప్పుడు ఈ సంఘటన జరిగింది. .కోర్టు జారీ చేసిన రెండు నాన్ బెయిలబుల్ వారెంట్లను అమలు చేసేందుకు పోలీసులు అక్కడికి వెళ్లగా నాలుగు రోజుల బాలుడు మృతి చెందినట్లు ఆరోపణలు వచ్చాయి. ప్రాథమికంగా, శిశువు శరీరంపై బాహ్య గాయాలు కనుగొనబడలేదు. బాడీని పోస్టుమార్టం పరీక్షకు పంపాం అని గిరిదిహ్ పోలీసు సూపరింటెండెంట్ అమిత్ రేణు తెలిపారు.

ఇది సర్కారీ హత్య..(Jharkhand Atrocity)

శవపరీక్ష నివేదిక వస్తే అసలు ఏం జరిగిందో చెప్పలేమని ఎస్పీ తెలిపారు. మేజిస్ట్రేట్ పర్యవేక్షణలో వైద్య నిపుణుల బృందం వీడియోగ్రఫీతో శవపరీక్ష నిర్వహిస్తుందని ఆయన పేర్కొన్నారు.ప్రస్తుతం ఏ పోలీసు పసికందును హింసించినట్లు మాకు ఎటువంటి సమాచారం లేదు, ఆరోపణ నిజమని తేలితే, తప్పు చేసిన సిబ్బందిని వదిలిపెట్టమని ఎస్పీ రేణు తెలిపారు. చనిపోయిన శిశువు తాత భూషణ్ పాండే మరియు మరొక వ్యక్తిపై నాన్ బెయిలబుల్ వారెంట్లు అమలు చేయడానికి నలుగురైదుగురు పోలీసు సిబ్బంది వెళ్లారని అన్నారు.బీజేపీ సీనియర్ నేత మరియు మాజీ ముఖ్యమంత్రి బాబూలాల్ మరాండి దీనిని ‘హేయమైనది’గా అభివర్ణించారు. సీనియర్ అధికారులను సస్పెండ్ చేయడంతో పాటు ఈ కేసులో వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు.ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ జీ, కాస్త సిగ్గుపడండి.. రాంచీ నుంచి సీనియర్‌ అధికారుల బృందాన్ని పంపండి.. ముందుగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి, నవజాత శిశువును చంపిన పోలీసులను జైలుకు పంపండి. లేదంటే ఆ పాపం నుంచి మీరు కూడా బయటపడరు. నాలుగు రోజుల పసిపాప సర్కారీ హత్య అని మరాంటి ట్వీట్ చేశారు.

పోలీసులు తెల్లవారుజామున 3.20 గంటలకు తమ ఇంటిపై దాడి చేశారని, బలవంతంగా తలుపులు తెరిచారని భూషణ్ పాండే అనే వ్యక్తి ఆరోపించిన వీడియో వైరల్ అయింది.నేను పారిపోయాను. మహిళలు కూడా బయటకు పరుగెత్తారు. నాలుగు రోజుల చిన్నారి అక్కడ నిద్రిస్తుండగా పోలీసులు ఇంటిని వెతకడం ప్రారంభించారు. శిశువును తొక్కి చంపారు అంటూ వీడియోలోని వ్యక్తి పేర్కొన్నాడు. కాగా, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికార జేఎంఎం శాసనసభ్యుడు సుదివ్య కుమార్ హామీ ఇచ్చారు.

Exit mobile version
Skip to toolbar