Site icon Prime9

Diwali Gifts: దీపావళి బహుమతిగా సిబ్బందికి కార్లు, బైక్‌లు ఇచ్చిన జ్యువెలరీ షాప్ యజమాని

Diwali gift

Diwali gift

Chennai: ఉద్యోగులకు ఖరీదైన కార్లు, బైకులు ఇచ్చి సర్ ప్రైజ్ కు గురి చేశారు తమిళనాడులోని ఓ జ్యువెలరీ షాప్ యజమాని. ఆయన అందించిన బహుమతులు చూసి ఉద్యోగులు ఎంతో ఆనందపడ్డారు. చెన్నైకి చెందిన జ్యువెలరీ షాప్ యజమాని జయంతి లాల్ చయంతి తన సిబ్బందిని ఈ సంవత్సరం భారీ బహుమతులతో ఆశ్చర్యపరిచారు. దీపావళి కానుకగా రూ. 1.2 కోట్ల విలువైన కార్లు మరియు బైక్‌లను ఇచ్చారు. అతను 10 కార్లు మరియు 20 బైక్‌లను బహుమతిగా ఇచ్చారు. దీనితో సిబ్బంది ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఈ సందర్బంగా చయంతి మాట్లాడుతూ సిబ్బందిని ప్రోత్సహించడానికే ఈ బహుమతులను ఇచ్చినట్లు చెప్పారు. వారు నా వ్యాపారంలో, అన్ని సమయాల్లో నాతో కలిసి పనిచేశారు. నాకు లాభాలు ఆర్జించారు అని చెప్పారు. వారు కేవలం సిబ్బంది మాత్రమే కాదు. నా కుటుంబం. కాబట్టి, వారికి అలాంటి సర్ ప్రైజ్‌లు ఇవ్వడం ద్వారా వారిని నా కుటుంబ సభ్యుల్లాగే చూడాలనుకున్నాను. నేను హృదయపూర్వకంగా చాలా సంతోషంగా ఉన్నాను. ప్రతి యజమాని వారి సిబ్బందిని మరియు సహోద్యోగులకు బహుమతులు ఇవ్వడం ద్వారా గౌరవించాలని చెప్పారు.

Exit mobile version