Site icon Prime9

JD(S) joins NDA: ఎన్‌డీఏలో కలిసిన జెడీఎస్‌

JD(S) joins NDA

JD(S) joins NDA

JD(S) joins NDA: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జెడీఎస్‌ నాయకుడు హెచ్‌డీ కుమారస్వామి శుక్రవారం నాడు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను ఢిల్లీలో కలుసుకున్నారు. అధికారికంగా ఎన్‌డీఏలో చేరారు. అమిత్‌ షా, కుమార స్వామి సమావేశంలో బీజేపీ ప్రెసిడెంట్‌ జెపీ నడ్డా, గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌ కూడా హాజరయ్యారు.  కాగా సోషల్‌ మీడియా ఎక్స్‌లో జెపీ నడ్డా ఈ విషయం తెలిపారు. ఎన్‌డీఏలో జెడీ-ఎస్‌ కలిసినందుకు నడ్డా సంతోషం వ్యక్తం చేశారు. జెడీ ఎస్‌ ను ఎన్‌డీఏలోకి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నామన్నారు. కుమారస్వామి పార్టీ కలయికతో ఎన్‌డీఏ మరింత బలపడుతుందన్నారు.

గత కొంత కాలంగా చర్చలు..(JD(S) joins NDA)

కాగా బీజేపీ, జెడీ ఎస్‌ పార్టీల మధ్య గత కొంత కాలంగా చర్చలు జరుగుతున్నాయి. అయితే కర్ణాటక మాజీ సీఎం , బీజేపీ సీనియర్‌ నాయకుడు బీఎస్‌ యడియూరప్పు ఇటీవలే వచ్చే లోకసభ ఎన్నికల్లో జెడీ ఎస్‌తో పొత్తు ఉంటుందని ప్రకటించారు. కర్నాటకలో మొత్తం 28 లోకసభ నియోజకవర్గాలుంటే నాలుగు లోకసభ సీట్లకు ప్రాంతీయపార్టీ జెడిఎస్‌ పోటీ చేస్తుందన్నారు. అయితే యడియూరప్ప మాత్రం ప్రస్తుతం ఇరు పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయని.. మోదీ, అమిత్‌ షాలు బిజీగా ఉన్నారని… గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన వెంటనే జెడీఎస్‌ ఎన్‌డీఏలో కలుస్తుందన్నారు.

ఇదిలా ఉండగా 2019 లోకసభ ఎన్నికల్లో రాష్ర్టంలో బీజేపీ క్లీన్‌ స్వీప్‌ చేసింది. మొత్తం 25 లోకసభ స్థానాలు గెలుచుకుంది. ఇండిపెండెంట్‌ సభ్యురాలు సుమలత మాడ్యా నుంచి బీజేపీ మద్దతుతో గెలిచారు. కాంగ్రెస్‌, జెడీ ఎస్‌ ఒక్కో సీటు గెలిచాయి. కాగా ఈ ఏడాది మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 135 సీట్లు, బీజేపీ, 66 సీట్లు. జెడీఎస్‌ 19 సీట్లు గెలుచుకున్నాయి.

Exit mobile version
Skip to toolbar