Site icon Prime9

Jammu Kashmir: హిజ్బుల్ కమాండర్ అమీర్ ఖాన్ భవనాన్ని కూల్చేసిన జమ్మూకశ్మీర్ ప్రభుత్వం

Jammu Kashmir

Jammu Kashmir

Jammu Kashmir: పహల్గామ్‌లోని లెవార్ గ్రామంలో ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ అమీర్ ఖాన్‌కు చెందిన భవనాన్ని జమ్మూ కాశ్మీర్ పరిపాలనా యంత్రాంగం శనివారం బుల్డోజర్‌తో కూల్చివేసింది.

గులాం నబీ ఖాన్ అలియాస్ అమీర్ ఖాన్ హిజ్బుల్ ముజాహిదీన్ యొక్క టాప్ ఆపరేషనల్ కమాండర్. అతను 90వ దశకం ప్రారంభంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)కి వెళ్లాడు.అనంత్‌నాగ్‌లోని పహల్గామ్‌లో హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద కమాండర్ అమీర్ ఖాన్ ఇంటిని జమ్మూ కాశ్మీర్ అధికారులు కూల్చివేసారు.జాయింట్ ఆపరేషన్ బృందం అనంత్‌నాగ్ జిల్లాలోని లేవార్ గ్రామంలో మేజిస్ట్రేట్ సమక్షంలో ఈ డ్రైవ్ నిర్వహించింది. ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమిలో నిర్మించిన అమీర్ ఖాన్ కాంపౌండ్ వాల్‌ను కూడ బుల్డోజర్ కూల్చివేసింది. కశ్మీర్ లోయను టెర్రర్ రహితంగా మార్చేందుకు, ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం కలిగించేందుకు ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ కమాండర్, పుల్వామాలోని న్యూకాలనీలోని ఆక్రమిత ప్రభుత్వ భూమిలో నిర్మించిన ఉగ్రవాది ఆషిక్ నెంగ్రూ ఇంటిని డిసెంబర్ 10న కూల్చివేసిన సంగతి తెలిసిందే.కూల్చివేత తర్వాత, పుల్వామాలోని నెంగ్రూ ఇంటిని కూల్చివేసినందుకుటెర్రర్ గ్రూప్ అధికారులను హెచ్చరించింది. నెంగ్రూ ఇంటిని కూల్చివేసిన అధికారుల ఇంటికి నిప్పు పెట్టాలని స్థానికులకు పిలుపునిచ్చింది. నెంగ్రూ పై చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA) కింద కేసు నమోదయింది.

Exit mobile version