XPoSat: ఎక్స్ పోశాట్ ప్రయోగంతో నూతన సంవత్సరానికి స్వాగతం పలికిన ఇస్రో

కొత్త ఏడాది తొలి రోజున ఇస్రో చేపట్టిన పీఎస్‌ఎల్వీ-సీ58 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. 25 గంటల కౌంట్‌డౌన్ అనంతరం నిప్పులను వెదజల్లుతూ రాకెట్ నింగిలోకి విజయవంతంగా వెళ్లింది. దీనితో ఈ ఏడాది ఇస్రోకు శుభారంభం లభించింది.

  • Written By:
  • Updated On - January 1, 2024 / 12:39 PM IST

XPoSat: కొత్త ఏడాది తొలి రోజున ఇస్రో చేపట్టిన పీఎస్‌ఎల్వీ-సీ58 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. 25 గంటల కౌంట్‌డౌన్ అనంతరం నిప్పులను వెదజల్లుతూ రాకెట్ నింగిలోకి విజయవంతంగా వెళ్లింది. దీనితో ఈ ఏడాది ఇస్రోకు శుభారంభం లభించింది. ఉదయం 9 గంటల 10నిమిషాలకు పీఎస్‌ఎల్వీ-సీ58 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. పీఎస్‌ఎల్వీ-సీ58 రాకెట్‌ ద్వారా 480 కిలోల ఎక్స్‌-రే పొలారిమీటర్‌ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపించారు. ఈ ఎక్స్‌పో శాట్‌తోపాటు కేరళ యూనివర్సిటీ విద్యార్థులు రూపొందించిన విమెన్ ఇంజినీర్డ్ శాటిలైట్ ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్వీ-సీ58 రాకెట్‌ నింగిలోకి మోసుకెళ్లింది. ఎక్స్‌పోశాట్‌తోపాటు మొత్తం పది బుల్లి ఉపగ్రహాలను కూడా భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.

ఎక్స్‌రే మూలాలను అన్వేషించడం..(XPoSat)

ఎక్స్‌రే మూలాలను అన్వేషించడమే లక్ష్యంగా ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ఇమేజింగ్, టైం డొమైన్ అధ్యయనాలు, స్పెక్ట్రోస్కోపీపై దృష్టి సారించి.. మునుపటి మిషన్ల మాదిరిగా కాకుండా.. ఎక్స్-రే మూలాలను అన్వేషించనుంది ఎక్స్ పోశాట్. శాస్త్రవేత్తలను ఇస్రో చైర్మన్ సోమనాథ్ అభినందించారు. కొత్త ఏడాది విజయాన్ని అందుకున్నామని ఆనందం వ్యక్తం చేశారు. 2021 ఐఎక్స్‌పీఈ పేరిట ఈతరహా ప్రయోగం అమెరికా నిర్వహించిందని.. అమెరికా తర్వాత ఇలాంటి ప్రయోగం చేసిన ఘనత భారత్‌దే అని ఇస్రో చైర్మన్ అన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని ప్రయోగాలు చేపడతామని ఇస్రో చైర్మన్ సోమనాథ్ చెప్పారు.