Manipur: మణిపూర్ ప్రభుత్వం రాష్ట్రంలో ఇంటర్నెట్ పై నిషేధాన్ని జూన్ 15 వరకు పొడిగించింది. రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలు ఇటీవలి నివేదికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ద్వేషపూరిత ప్రసంగాలు, రెచ్చగొట్టే చిత్రాలు మరియు వీడియోలను ప్రసారం చేయడాన్ని నిషేధించడానికి, రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్నెట్ సస్పెన్షన్‌ను పొడిగించింది.
గవర్నర్ అధ్యక్షతన శాంతికమిటీ..(Manipur:)
అంతకుముందు శనివారం మణిపూర్‌లో గవర్నర్ అనుసూయా ఉయికే అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వం శాంతి కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీలో ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వంలోని కొందరు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు సభ్యులుగా ఉంటారు.హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం, కమిటీలో మాజీ సివిల్ సర్వెంట్లు, విద్యావేత్తలు, సాహిత్యవేత్తలు, కళాకారులు, సామాజిక కార్యకర్తలు మరియు వివిధ జాతుల ప్రతినిధులు కూడా ఉన్నారు రాష్ట్రంలోని వివిధ జాతుల మధ్య శాంతి-స్థాపన ప్రక్రియను సులభతరం చేయడం, వివాదాస్పద పార్టీలుసమూహాల మధ్య చర్చలు వంటివి ఉంటాయి. కమిటీ సామాజిక ఐక్యత, పరస్పర అవగాహనను బలోపేతం చేయాలి. వివిధ జాతుల మధ్య స్నేహపూర్వక సంభాషణను సులభతరం చేయాలని కేంద్ర హొం శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
మణిపూర్ లో జాతి ఘర్షణలు ప్రారంభమైన ఒక నెల తర్వాత చెదురుమదురు హింస కొనసాగుతున్న నేపధ్యంలో పరిస్థితిని చర్చించడానికి అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ శనివారం తన మణిపూర్ కౌంటర్ ఎన్ బీరెన్ సింగ్‌ను కలిశారు.