Wrestler Sushil Kumar: ఒలింపిక్ పతక విజేత రెజ్లర్ సుశీల్ కుమార్‌కు ఢిల్లీ రోహిణి కోర్టు శుక్రవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది, అతని భార్య వచ్చే వారం శస్త్రచికిత్స చేయించుకోనున్న నేపధ్యంలో అదనపు సెషన్స్ జడ్జి శివాజీ ఆనంద్ కుమార్‌ను నవంబర్ 12 వరకు మధ్యంతర బెయిల్‌పై విడుదల చేయాలని ఆదేశించారు,
కుమార్, మరో 16 మందితో పాటు మాజీ జూనియర్ నేషనల్ రెజ్లింగ్ ఛాంపియన్ సాగర్ ధంకర్ హత్య కేసులో నిందితులుగా ఉన్నారు. అతను గత సంవత్సరం అరెస్టయ్యాడు. రెండు పూచీకత్తులతో లక్షరూపాయల వ్యక్తిగత బాండ్ ను ఇవ్వాలని కోర్టు సుశీల్ ను ఆదేశించింది. మరోవైపు అతనిపై నిఘా ఉంచడానికి కనీసం ఇద్దరు భద్రతా వ్యక్తులు అతనితో 24 గంటలు ఉండాలి” అని కోర్టు పేర్కొంది. భద్రతా ఏర్పాట్ల కోసం రోజుకు రూ.10,000 మొత్తాన్ని కుమార్ భరించాలని తెలిపింది.
మే నెలలో ఆస్తి వివాదంపై సుశీల్, మరికొందరు మాజీ జూనియర్ నేషనల్ రెజ్లింగ్ ఛాంపియన్ సాగర్ ధంకర్ మరియు అతని స్నేహితులతో స్టేడియంలో దాడికి పాల్పడ్డారు. అనంతరం గాయాలపాలైన ధనకర్ మృతి చెందాడు.