Site icon Prime9

INLD Rally: చంద్రబాబు, కేసీఆర్ లకు హర్యానా ఆహ్వానం

Haryana Invites Chandrababu And Kcr prime9 news

Haryana Invites Chandrababu And Kcr prime9 news

Haryana: ఏపీ, తెలంగాణలో ప్రముఖ రాజకీయ ముఖ్య నేతలు అయిన చంద్రబాబు నాయుడు మరియు సీఎం కేసీఆర్ లకు హర్యానా రాష్ట్రం ఆహ్వానం పలికింది. ఈ నెల 25న భారత మాజీ ఉప ప్రధాని దేవీలాల్ జయంతి సందర్భంగా హర్యానాలో ఇండియన్‌ నేషనల్‌ లోక్‌దళ్‌(ఐఎన్‌ఎల్‌డీ) భారీ ర్యాలీ నిర్వహించనుంది. దానికి గానూ చంద్రబాబు, కేసీఆర్ లను ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన అభయ్ చౌతాలా ఆహ్వానించారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌, టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు సహా దేశవ్యాప్తంగా ఉన్న పలువురు కీలక రాజకీయ నేతలను ఆహ్వానించామని ఐఎన్‌ఎల్‌డీ పేర్కొనింది.

ఈ జాబితాలో బీహార్ సీఎం నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, శిరోమణి అకాలీదళ్ నేత ప్రకాశ్ సింగ్ బాదల్, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సహా తదితర కీలక నేతలను ఆహ్వానించినట్టు అభయ్ చౌతాలా వెల్లడించారు. నితీశ్ కుమార్, తేజస్వీ యాదవ్ ర్యాలీకి హాజరవుతామని హామీ ఇచ్చారని ఆయన చెప్పారు. దేవీలాల్‌ జయంతి సందర్భంగా ప్రతిపక్షాలన్నీ ఒకతాటిపైకి వచ్చి పలు సమస్యలు చర్చించనున్నారు.

Exit mobile version