Site icon Prime9

WFI: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా( డబ్ల్యుఎఫ్ఐ) కు ముగ్డురు సభ్యుల కమిటీ నియామకం

WFI

WFI

WFI: భారత ఒలింపిక్ సంఘం ( ఐఓఏ) బుధవారం రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ( డబ్ల్యుఎఫ్ఐ ) కోసం ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. భూపేంద్ర సింగ్ బజ్వా ఛైర్మన్‌గా, సోమయ, మంజుషా కన్వర్ సభ్యులుగా నియమితులయ్యారు. ఈ కమిటీ డబ్ల్యుఎఫ్ఐ యొక్క వివిధ పనులు మరియు కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది.

వివాదాల నేపధ్యంలో..(WFI)

వీటిలో ఆటగాళ్ల ఎంపిక, అంతర్జాతీయ టోర్నమెంట్‌లకు ఆటగాళ్ల పేర్లను పంపడం, క్రీడా ఈవెంట్లను నిర్వహించడం, పర్యవేక్షించడం మరియు బ్యాంక్ ఖాతాలను నిర్వహించడం వంటివి ఉన్నాయి.
క్రీడా మంత్రిత్వ శాఖ ఆదివారం డబ్ల్యుఎఫ్ఐ ని సస్పెండ్ చేసింది. సంజయ్ సింగ్ అధ్యక్షతన కొత్తగా ఎన్నికైన బోర్డు ఇప్పటికీ లైంగిక ఆరోపణలతో సస్పెండ్ చేయబడిన మాజీ ఆఫీస్ బేరర్ల ప్రభావంలో ఉందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ ఏడాది జనవరి నుంచి డబ్ల్యుఎఫ్ఐ ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై పలువురు ప్రముఖ రెజ్లర్లు నిరసన వ్యక్తం చేయడంతో ఇది వార్తల్లో కెక్కింది.
అథ్లెట్లు బ్రిజ్ భూషణ్ హయాంలో తాము లైంగిక వేధింపులు మరియు బెదిరింపులను ఎదుర్కొన్నామని ఆరోపించారు. సంఘటనలను బహిర్గతం చేశారు. ఈ నేధ్యంలో ఐఓసీ మరియు క్రీడా మంత్రిత్వ శాఖ డబ్ల్యుఎఫ్ఐ బోర్డును సస్పెండ్ చేయడం ద్వారా జోక్యం చేసుకున్నాయి.డబ్ల్యుఎఫ్‌ఐ కొత్త అధ్యక్షుడి నియామకం జరిగే వరకూ ప్రతిష్టంభన నెలకొంది.అయితే కొత్త అధ్యక్షుడిగా సంజయ్ సింగ్ ఎన్నికయినప్పటికీ రెజ్లర్లు వెనక్కి తగ్గలేదు. డబ్ల్యుఎఫ్ఐ మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌తో సంజయ్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని వారు ఆరోపించారు.సంజయ్ నియామకం తర్వాత నిరసనగా రెజ్లింగ్ నుంచి సాక్షి మాలిక్ రిటైర్ కావడం, బజరంగ్ పునియా తన పద్మశ్రీ అవార్డును న్యూఢిల్లీలోని కర్తవ్య పథ్ పేవ్‌మెంట్‌పై వదిలేయడం, వినేష్ ఫోగట్ తన ఖేల్ రత్న మరియు అర్జున అవార్డులను తిరిగి ఇచ్చేస్తానని ప్రతిజ్ఞ చేయడం జరిగింది.

Exit mobile version